News
News
X

Minister KTR : పీయూష్ గోయల్ ఇప్పుడు నూకలు తింటారేమో?, ఆహార ధాన్యాల కొరతపై కేటీఆర్ కౌంటర్

Minister KTR : కేంద్ర ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాల వల్లే దేశంలో ఆహార ధాన్యాల కొరత వచ్చిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

FOLLOW US: 

Minister KTR : తెలంగాణ రాష్ట్రాన్ని ఫేయిల్యూర్ స్టేట్ గా చూపించాలనుకున్న మోదీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరునెలల కింద గొప్పగా చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఇప్పటికే గోధుమలు, వాటి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన మోదీ సర్కార్, తాజాగా నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందన్నారు. ఎఫ్సీఐ గోడౌన్లతో పాటు వివిధ కేంద్రాల దగ్గర బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని కేవలం ఆరు నెలల కిందట తాము విజ్ఞప్తి చేస్తే, దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆహార ధాన్యాల కొరతకు కారణమేంటో చెప్పాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను  కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ ప్రజల అవసరాలపై కనీస అవగాహన లేకపోవడం, ఆహార ధాన్యాల సేకరణలో కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానమంటూ లేకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణమని కేటీఆర్ విమర్శించారు.  ఈ మేరకు కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లేఖ రాశారు.   

కేంద్రం కొర్రీలు పెట్టడంతోనే 

తెలంగాణపై  కేంద్రం వివక్షతోనే దేశంలో ఆహార ధాన్యాల కొరత తలెత్తే ప్రమాదం ముంచుకొస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశ ప్రజల ఆహార అవసరాలపై మోదీ సర్కార్ కు దీర్ఘకాలిక ప్రణాళిక లేదనేది ప్రస్తుత సంక్షోభంతో తేలిపోయిందన్నారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమంపై కనీస అవగాహన, ఆలోచన, ప్రణాళిక లేని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండడం దురదృష్టకరమని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్, ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలే అయినా  75 ఏళ్ల  స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా అందుకోని విధంగా ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణకి న్యాయంగా దక్కాల్సిన చేయూత కేంద్రం అందడం లేదని కేటీఆర్ ఆరోపించారు. నీళ్ల విషయంలో అరిగోస పడ్డ తెలంగాణ రైతాంగ దశ మార్చడానికి సీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేశారన్నారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటూ కేంద్రం కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులను వరి వెయ్యనియ్యకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఫలితంగా గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో ఇది కోటి ఎకరాలు దాటే అవకాశం కూడా ఉందని కేటీఆర్ చెప్పారు. దీంతో దేశ వ్యాప్తంగా 12-15 మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఇందుకే బియ్యం ఎగుమతులను కేంద్రం నియంత్రించిందన్నారు. 

వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ 

 దేశానికి ఒక సమగ్ర ఆహార ధాన్యాల సేకరణ విధానం లేకపోవడం మోదీ ప్రభుత్వ వైఫల్యమే అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఆహార భద్రత లేని పరిస్థితిలో ఉండటం బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయ రంగం, ఆహార అవసరాలపై ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు. ఇందుకోసం వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తుందన్నారు. పండిన ధాన్యాన్ని సేకరించకుండా కేవలం రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రోజు ఆహార కొరత ముంగిట్లో దేశం నిలిచిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనపెట్టి వివక్షకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.  

Published at : 10 Sep 2022 06:54 PM (IST) Tags: PM Modi Hyderabad News TS News Minister KTR food grains food grains deficit

సంబంధిత కథనాలు

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కేసీఆర్‌కు చిత్తశుద్ధే ఉంటే సీబీఐ విచారణ ఎదుర్కోవాలి: వైఎస్ షర్మిల

కేసీఆర్‌కు చిత్తశుద్ధే ఉంటే సీబీఐ విచారణ ఎదుర్కోవాలి: వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?