LLR Online Test: కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లెర్నర్ లైసెన్స్ టెస్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా, ఇంటి నుంచే రాసేందుకు వీలు కల్పించేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 'సారథి న్యూ లెర్నర్ లైసెన్స్ పరీక్ష సిస్టమ్'ను, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించనున్నారు.

Continues below advertisement

ఏఐ ద్వారా పరీక్ష  

పరీక్షలో అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడనున్నారు. అభ్యర్థి స్థానంలో వేరొకరు పరీక్ష రాసినా, పరీక్ష సమయంలో అభ్యర్థి స్క్రీన్ ముందు లేకపోయినా ఏఐ వెంటనే గుర్తించి హెచ్చరిస్తుంది. దీనిని విజయవంతంగా పరీక్షించిన రవాణా శాఖ, వారం రోజుల్లోనే ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

పరీక్ష రాసే విధానం  

  1. ఆన్‌లైన్ పరీక్ష కోసం ప్రత్యేకమైన బ్రౌజర్‌తో పాటు రియల్ టైమ్ వెరిఫికేషన్ తప్పనిసరి.
  2. అభ్యర్థి తన అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
  3. ఎల్ఎల్ఆర్ పరీక్ష రాస్తున్న సమయంలో ఇతర వెబ్‌సైట్లు లేదా ట్యాబ్‌లు ఓపెన్ చేయడానికి వీలుండదు.
  4. ఫేషియల్ వెరిఫికేషన్ పలుమార్లు విఫలమైతే సిస్టమ్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆ సందర్భంలో అభ్యర్థి నేరుగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి పరీక్ష రాసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్నల సూచికలు  

  1. గ్రీన్ : ప్రశ్నకు సమాధానం గుర్తిస్తే.
  2. రెడ్ : ప్రశ్న చూశారు, కానీ సమాధానం రాయలేదు.
  3. వైట్ : ప్రశ్నను ఇంకా చూడలేదు.

పరీక్ష పూర్తయిన వెంటనే ఎన్ని సరైన సమాధానాలు రాశారో స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. పరీక్ష పాస్ అయిన వెంటనే క్యూఆర్ కోడ్ ఆధారిత ఎల్‌ఎల్‌ఆర్ డిజిటల్‌గా పొందుతారు. Also Read: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !

Continues below advertisement

ఎగ్జామ్ రాసేటప్పుడు 

  • ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు వెబ్‌క్యామ్ సౌకర్యం ఉన్న ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా స్పష్టమైన ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
  • ఫేషియల్ వెరిఫికేషన్ నిరంతరాయంగా జరగాలంటే అభ్యర్థి ముఖంపై తగినంత వెలుతురు ఉండే గదిలోనే కూర్చోవాలి.
  • ఆన్‌లైన్ ద్వారా పొందిన లెర్నర్ లైసెన్స్ పొందిన తేదీ నుంచి 6 నెలల (180 రోజులు) పాటు చెల్లుబాటు అవుతుంది. LLR వచ్చిన 30 రోజుల తర్వాత ఎప్పుడైనా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. Also Read: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం