అన్వేషించండి

Medical Seats Vacant: ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు

Medical Seats Vacant: తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఫీజుల కారణంగానే విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నీట్ కౌన్సెలింగ్‌లో 175 ప్రైవేట్ ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ.
  • ప్రైవేట్ కళాశాలల అధిక ఫీజులే ఖాళీ సీట్లకు ప్రధాన కారణం.
  • ప్రభుత్వ కళాశాలల సీట్లు నిండగా, ప్రైవేట్ సీట్లు మిగిలాయి.
  • అధిక ఫీజులపై తక్షణ సమీక్ష చేపట్టాలని నిపుణుల డిమాండ్.

Medical Seats Vacant: హైదరాబాద్‌ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించిన నీట్-యూజీ 2026 కౌన్సెలింగ్ పలు విడతలుగా పూర్తయినప్పటికీ, రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కనీసం 175 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ భర్తీ కాని సీట్లన్నీ ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా (కేటగిరీ-బి), ఎన్ఆర్ఐ కోటా (కేటగిరీ-సి) పరిధిలోనివే కావడం గమనార్హం.   

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు చాలా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అక్కడ అన్ని సీట్లు భర్తీ అయ్యాయని KNRUHS జాయింట్ రిజిస్ట్రార్ జె. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇలా ప్రైవేట్ కాలేజీల్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోవడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.   

సీట్లు మిగలడానికి కారణాలు 

ప్రైవేట్ కాలేజీలలో బి-కేటగిరీ సీట్లకు వార్షిక ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉండగా, ఎన్ఆర్ఐ కోటాకు రూ.24 లక్షల నుండి రూ.25 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది.  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ప్రైవేట్ యాజమాన్యాలు హాస్టల్ వసతి, ఇతర నిబంధనల పేరుతో అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేటగిరి-ఎ విద్యార్థుల నుంచి సైతం నిబంధనల ప్రకారం ఉన్న రూ.60,000 ఫీజుకు బదులుగా రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు దండుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: సదర్ అంటే జల్సా కాదు.. రాష్ట్ర పండుగ, యాదవుల ఆత్మగౌరవ ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

ఎంబీబీఎస్ పూర్తైన తర్వాత డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా చేరే వైద్యులకు నెలకు రూ. 20,000 నుండి రూ. 30,000 మాత్రమే వేతనం లభిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే తప్ప మంచి అవకాశాలు లభించకపోవడం, మరోవైపు ఇంజినీరింగ్ అభ్యర్థులకు లక్షల రూపాయల ప్యాకేజీలు రావడం వైద్య రంగానికి పెద్ద సవాలుగా మారింది. రాష్ట్రంలో 10,000 కంటే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, వాటిలో 6,000 పైగా సీట్లు 29 ప్రైవేట్ కాలేజీల్లోనే ఉన్నాయి. ఎన్‌ఎమ్‌సీ ఇటీవల 2026-27 విద్యాసంవత్సరానికి మంజూరు చేసిన 1,010 అదనపు సీట్లలో ప్రైవేట్ రంగానికే 900 సీట్లు రావడం విశేషం.  

 నిపుణులు ఏమంటున్నారంటే? 

వైద్య విద్యపై విద్యార్థులకు ఆసక్తి తగ్గడం వల్ల ఈ సీట్లు ఖాళీగా మిగలలేదని, కేవలం ఆర్థిక భారం, ఇతర కారణాల వల్లే అర్హులైన విద్యార్థులు తమ కలలను వదులుకోవాల్సి వస్తోందని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ కాలేజీలు ఎందుకు ఫీజులను విపరీతంగా పెంచుతున్నాయో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.  

Also Read: అమిత్ షా హైదరాబాద్ వాక్ సక్సెస్ - గ్రూపు తగాదాలకు చెక్ - బీజేపీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి?

Frequently Asked Questions

రాష్ట్రంలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి? అవి ఏ కోటాకు చెందినవి?

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ తర్వాత ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 175 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి మేనేజ్‌మెంట్ కోటా (కేటగిరీ-బి), ఎన్ఆర్ఐ కోటా (కేటగిరీ-సి) పరిధిలోనివి.

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు ఖాళీగా ఉండటానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు (కేటగిరీ-బికి రూ.10-11 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకు రూ.24-25 లక్షలు), హాస్టల్ పేరుతో అదనపు వసూళ్లు, మరియు పూర్తయ్యాక తక్కువ జీతాలు (రూ.20,000-30,000) ప్రధాన కారణాలు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటం సాధారణమేనా?

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫీజులు తక్కువగా ఉండటంతో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోవడం ఇదే తొలిసారి అని KNRUHS జాయింట్ రిజిస్ట్రార్ తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget