Borewell NOC Rules: ఎల్‌నీనో పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జల మట్టాలు పడిపోకుండా చూడటం, లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జల వనరులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాగునీటి అవసరాలు తప్ప ఇతర పనులకు శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 2027 జులై చివరి వరకు అమల్లో ఉండేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో 259 ద్వారా ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
జీవో 259లోని ముఖ్యమైన నిబంధనలు
- అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, వాణిజ్య-పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సప్లైయిర్లు భూగర్భ జలాల వినియోగ నిబంధనలు-2023 ప్రకారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందిన తర్వాతే కొత్త బోర్లు తవ్వాల్సి ఉంటుంది.
- అనుమతులతో బోర్‌వెల్ తవ్వకం పూర్తి చేసిన 15 రోజుల్లోగా రిగ్ ఆపరేటర్ నిర్ణీత అధికారికి ‘వెల్ కంప్లీషన్ రిపోర్ట్’ను సబ్మిట్ చేయాలి. ఆ బోర్‌వెల్‌ను సంబంధిత తహసీల్దార్ వద్ద తప్పనిసరిగా నమోదు చేయించాలి.
- నిర్మాణ ప్రాజెక్టులు, తోటల పెంపకం, ల్యాండ్‌స్కేపింగ్, రోడ్ల శుభ్రత వంటి అవసరాలకు భూగర్భ జలాలను వాడకూడదు. జలమండలి అందుబాటులోకి తెచ్చిన శుద్ధి చేసిన మురుగు నీటిని మాత్రమే వినియోగించాలి.
- భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీసినా లేదా దుర్వినియోగం చేసినా 'వాల్టా' (WALTA) చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.
- ప్రతిఒక్కరూ వాననీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. Also read: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
వివిధ శాఖలకు బాధ్యతలు
- భూగర్భజల శాఖ: నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలి.
- మున్సిపల్ కార్పొరేషన్లు: భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను తప్పనిసరిగా అమలు చేయించాలి.
- హైడ్రా : చెరువులు, కుంటలు, నీటి రీఛార్జ్ ప్రాంతాలను ఆక్రమణలు, వ్యర్థాల డంపింగ్, కాలుష్యం నుంచి కాపాడాలి.
మంచి నీటి సరఫరా పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో లీకేజీలు, వృథాను అరికట్టడంతో పాటు కంటింజెన్సీ మానిటరింగ్ కమిటీకి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక అందించాలి. Also read: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
