సీఎం కేసీఆర్(CM KCR) పాకిస్తాన్ కన్నా దిగజారి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎవరు శత్రువులు లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(Bjp)కి శత్రువులు కేవలం పాకిస్తాన్ మాత్రమేమనన్నారు. రాజకీయ పార్టీలు(Political Parties) శత్రువులు కారని, కేవలం ప్రత్యర్థులు మాత్రమే అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strikes) జరిగాయని పాకిస్తాన్ నే చెప్పిందని, వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. సైనికులను అవమానపరిచే విధంగా సీఎం కేసీఆర్ మాటలు ఉన్నాయన్నారు. సైనికుల(Jawans) ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసేవిధంగా కేసీఆర్ మాట్లాడారన్నారు. 


సీఎం కేసీఆర్ తీరును తెలంగాణ ప్రజలు, మేధావులు అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తీరు మారిందన్నారు. తెలంగాణ ప్రజలను బానిసలు చూస్తూ తనకు జీహుజూర్‌ అనాలని కేసీఆర్‌ భావిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి(TRS Govt) వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోతున్నారని ఆరోపించారు. నాంపల్లి(Nampalli)లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రశ్నించేవారు ఉండకూడదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. 


 సీఎం కేసీఆర్ చాలా దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ(PM Modi), బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బెదిరించే ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. కేంద్రానికి, బీజేపీకి ప్రత్యర్థుల మాత్రమే ఉన్నారని, ఎవరూ శత్రువులు కారన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను దెబ్బతీసేలా సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాదులు(Pakistan Terrorists) కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారన్నారు. నిజాం రాచరిక పాలన మళ్లీ రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం(Modi Govt) ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ సవాల్‌ను కేంద్ర ప్రభుత్వం తరఫున స్వీకరిస్తునన్నారు. సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో గన్‌పార్కు(Gur Park) వద్దకు రావాలని కిషన్‌రెడ్డి అన్నారు.


విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉచిత కరెంట్ రైతులకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారికి ఉచితంగా ఇచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. మోటర్లకు మీటర్లు(Motor Meters) పెట్టాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. యూరియా(Urea)పై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో తెలంగాణ(Telangana)లో ప్రధాని మోదీ పర్యటన ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. యూరియా సబ్సిడీ గత ఏడాది రూ. 79 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ. ఒక లక్ష కోట్లు ఇస్తున్నామన్నారు. అంటే గతంతో పోల్చితే 30 శాతానికి పైగా సబ్సిడీ(Subsidy) పెంచామన్నారు.