అన్వేషించండి

Telangana Municipal Elections: క్యాతనపల్లిలో హైటెన్షన్- మంత్రి వివేక్ కారుపై దాడి.. బాల్క సుమన్‌పై హత్యాయత్నం కేసు?

High tension in Kyatanapalli: క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బాల్క సుమన్‌ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Minister Vivek car attacked  in Kyatanapalli: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మంగళవారం ఉదయం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికను పర్యవేక్షించేందుకు, తమ అభ్యర్థికి మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఉద్రిక్తతల కారణంగా ఎన్నిక వాయిదా 
 
పరిస్థితి విషమించడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మంత్రి వివేక్ ప్రయాణిస్తున్న కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రికి ఎటువంటి గాయాలు కానప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఈ  ఉద్రిక్తతల కారణంగా చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. 

బాల్క సుమన్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలని వివేక్ డిమాండ్ 
 
ఘటన అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. బాల్క సుమన్ కావాలనే గూండాలను రప్పించి తనపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు.  ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారు. నాపై జరిగిన ఈ దాడి కేవలం రాజకీయ ఘర్షణ కాదు, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యాయత్నం అని వివేక్ ఆరోపించారు.  బాల్క సుమన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, ఆయనపై హత్యాయత్నం  కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను బాల్క సుమన్ హింసాత్మకంగా మార్చారని మండిపడ్డారు.

మంత్రే అరాచకం చేస్తున్నారని బాల్క సుమన్ ఆరోపణ 
 
మంత్రి ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా ఖండించారు. మంత్రి వివేక్ అధికార బలంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎన్నికను ఏకపక్షంగా గెలుచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.  మంత్రి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బిఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారు. అరెస్టులకు మేము భయపడే ప్రసక్తే లేదు  అని సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి ప్రజలు కాంగ్రెస్ అరాచకాలను గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారని కౌంటర్ ఇచ్చారు.

బాల్క సుమన్‌ను అరెస్టు చేస్తారా?

మంత్రి వివేక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. బాల్క సుమన్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో చెన్నూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా, ఈ ఘటనతో అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi liquor case: కేసు కొట్టేసినా వదలని సీబీఐ - కవితకు నోటీసులు ఇవ్వడానికి అసలు కారణం ఇదే!
కేసు కొట్టేసినా వదలని సీబీఐ - కవితకు నోటీసులు ఇవ్వడానికి అసలు కారణం ఇదే!
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
Advertisement

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో మలుపు! కవిత నివాసానికి సీబీఐ అధికారులు!
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
గ్యాస్ కొరతకు పర్ఫెక్ట్ సొల్యూషన్! భగవద్గీత, ఆయుర్వేదం చెప్పిన మంట అవసరం లేని ఆహార, ఆరోగ్య రహస్యాలు!
Shenlong Suezmax Mumbai Arrival: యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
యుద్ధం అంచున ఇండియన్ కెప్టెన్  సాహసం! హుర్ముజ్ జలసంధి దాటుకొని ముంబై చేరిన చముర నౌక!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
ఇప్పుడంతా ఉర్దూ పదాలతో టాటూ ట్రెండ్! ముస్లింలే కాదు అందరూ ఫాలో అవుతున్నారు!
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Ustaad Bhagat Singh : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Embed widget