BJP Indira Park Dharna : మంగళవారం  ఇందిరా పార్కు వద్ద బీజేపీ తలబెట్టిన ధర్నా కి హైకోర్టు అనుమతి ఇచ్చింది.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంపై మహా ధర్నాకి బీజేపీ పిలుపునిచ్చింది. లఅయితే  ధర్నా కి హైదరాబాద్ పోలీసులు  పర్మిషన్ ఇవ్వలేదు.  ఈ నెల 14న ధర్నా కోసం పోలీసులకు బీజేపీ నేతలు దరఖాస్తు ఇచ్చారు.  ధర్నా కి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించారు.  బీజేపీ నేతలు ధర్నా పేరుతో సెక్రటేరియట్ ముట్టడించే అవకాశం ఉందన్న ప్రభుత్వ న్యాయవాది వాదించారు.  ఇతర ధర్నాలు చేసేవారికి పర్మిషన్ ఇచ్చి... బీజేపీ కి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని ధర్మాసనం ప్రశ్నించడంతో..  వెయ్యి మంది వస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లేదన్న కారణాన్ని  ప్రభుత్వ న్యాయవాది  చెప్పారు.  
వెయ్యి మందిని కంట్రోల్ చేయలేకపోతే.. పోలీసులు ఇంకెందుకు ఉన్నారని  హైకోర్టు అసహనం వ్యక్తం చేశాు.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ధర్నాల వల్ల... లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రావట్లేదా అని ప్రశ్నించింది.  ఈ నెల 20న బాట సింగారం లో డబుల్ బెడ్ రూమ్ లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ లీడర్స్ ని అడ్డుకున్నారని  పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.  కేంద్ర మంత్రులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారని అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 


డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. అసలు ఇళ్లివ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ కొద్దిరోజులుగా విస్తృతంగా ధర్నాలు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని సొంత ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.  నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులను  పోలీసులు అరెస్ట్ చేశారు.  







బీజేపీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజల్ని  మభ్య పెడుతూనే ఉన్నారని.. తొమ్మిదేళ్ల కాలంలో ఒక్కరికి కూడా ఇళ్లు ఇవ్వలేదన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ అంశంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి.. వాటిని ఆశ చూపి.. ఓట్లు పొందాలని అనకుంటున్నారని... అలాంటి కుట్రల్ని చేధించాలని బీజేపీ అనుకుంటోంది.