Constable Died Fall From Building In Kukatpally: ఓ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని (Kukatpally) దేవినగర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో సీఐగా పనిచేస్తోన్న శేఖర్ కూకట్పల్లిలోని హెచ్ఎంటీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా జరిగిన వేడుకకు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు. ఆదివారం రాత్రి పార్టీ సందర్భంగా డిన్నర్ చేస్తున్న సమయంలో డేవిడ్ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి కింద పడిపోయారు. దీంతో తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Constable Death: కూకట్పల్లిలో తీవ్ర విషాదం - భవనంపై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి
Ganesh Guptha | 05 Aug 2024 04:45 PM (IST)
Hyderabad News: ఓ ఇన్‌స్పెక్టర్ బర్త్ డే పార్టీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో జరిగింది.
భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి