Harish Rao criticized Revanth Reddy :  100 రోజుల పాలన చూసి ఓటు వేయమని రేవంత్  రెడ్డి అంటున్నారని.. అసలు వంద రోజుల్లో ఆయనేం  చేశారని  బీఆర్ఎస్ సీనియ్ర నేత హరీష్ రావు ప్రశ్నించారు.  వైట్ పేపర్ ...ఆ ఆపేర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశాడని..  వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేశారని విమర్శించారు.  
ఆదాని ,  గుజరాత్ మెడల్ ఫైల్ అని మళ్ళీ ఆయనే గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అన్నాడని..  10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది...అలాంటప్పుడు మోడీని ఎందుకు అంత పొగడటమని ప్రశ్నించారు. అంటే కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పకనే చెప్పారన్నారు.  3 నెలల పాలన లో ప్రజలను,ఇటు కాంగ్రెస్ పార్టీ ని మోసం చేస్తున్నాడు... 100 రోజుల పాలన చూసి ఓటు వేయండి అన్నాడు మీరు మరి ఇప్పుడు ఎం చేశారని మీకు ఓటు వేయాలని ప్రశ్నించారు.  


రుణమాఫీ ఎందుకు చేయలేదు ? 


డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఏమైంది.ఇప్పటివరకు కూడా రుణమాఫీ లేదు. కనీసం మొన్న బడ్జెట్ లో కూడా రైతు రుణమాఫీ కి నిధులు కేటాయింపులు లేవు.   రైతులకు క్వింటాల్‌కు రూ.  500 బోనస్ ఇస్తామని చెప్పారు. పంట కొనుగోలు లో కూడా ఇలానే చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు బోనస్ అని  ప్రశఅనించారు. ఇప్పుడైనా వచ్చే యాసంగి పంటకు క్వీన్టల్ కు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు వచ్చింది.కొత్త కొత్త బోరు బండ్లు వచ్చాయి.ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోస్తున్నారన్నారు.  అవ్వ పెన్షన్ ఎంత వస్తుంది అన్నారు మేము వస్తే 4 వేలు ఇస్తాం అన్నారు..ఏమైంది కనీసం ఉన్న రెండు వేలు కూడా నేల నెల పడడం లేదు. ఒక్క నెల ఎగ్గొట్టారని విమర్శించారు.  బండ్ పేపర్ రాసిచ్చినారు..బండ్ పేపర్ రాసి ఇచ్చిన వారిపై కేస్ పెట్టాలని డిమాండ్ చేశారు. 


6 గ్యారంటీల్లో 13 హామీలు 


6 గ్యారెంటీ లల్లో 13 హామీలు ఉన్నాయి అవన్నీ అమలు చేయాలి అప్పుడే   ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  మహిళలను మహా లక్ష్మీ లను చేస్తాం అన్నారు ఏమైందని మహిళలు ఆలోచించాలన్నారు.  ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇస్తాం అన్నారు ఏమైంది ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారు.నాడు మేము అధికారంలోకి వస్తే ఉచితంగా అన్నారు ఇప్పుడు ఏమైంది. గృహిణులు ఆలోచన చేయాలని కోరారు.  నిరుద్యోగులకు 4000 వేలు ఇస్తాం అన్నారు. అసెంబ్లీలో ఆ ఊసే ఎత్తలేదు. ఓటు ఎదుకు వేయాలో ఆలోచన చేయాలన్నారు.  ఆటో అన్నలకు 12000 అన్నారు. ఏమైంది.ఆటో అన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు ఆలోచించాలన్నారు. 


ఇప్పటికే పదహారు వేల కోట్ల అప్పు 


అప్పుల గురించి ఆనాడు రాద్దాంతం చేసారని  ఇవాళ 16 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని ారోపించారు.  ఇంకా అప్పుకోసం ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ పథకానికి ఆంక్షలు పెట్టినందుకు ఓటేయాలా అని ప్రశ్నించారు.  ఉపాధి హామీ పథకం పని చేసే  3000 మందికి ఇప్పటివరకు జీతాలు రాలేదన్నారు.  వృద్దులకు, వితంతులకు,వికలాంగులకు ఒక నెల పెన్షన్ ఎగకొట్టారని..  విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లేవు.విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదన్నారు.  సీఎం ఆర్ ఎఫ్ దాదాపు 70 వేల మంది కి పెండింగ్ లొ పెట్టారని ఆరోపించారు.  నాడు పోలవరం ప్రాజెక్టు వాల్  , డయా ఫ్రొం వాల్ కొట్టుకుపోయింది ...ఇప్పటివరకు రిపోర్ట్ లేదు .  ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ డి ఎస్ ఏ వచ్చింది.ఆ రిపోర్ట్ 4 నెలల్లో వస్తుంది అంటున్నారు. అప్పటివరకు ఎందుకు సమయం పడుతుందని ప్రశ్నించారు. 


తుమ్మిడిహెట్టిపై రేవంత్‌కు అవగాహన లేదు !


వచ్చే వానాకాలం లో నీళ్లు ఇవ్వరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  వర్ష కాలంలో ఫ్లడ్ వస్తే పంప్ హౌస్ మునిగిపోతే మేము ప్రభుత్వం కు భారం పడకుండా త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు లిఫ్ట్ చేశామమన్నారు.  తుమ్మిడి హెట్టి దగ్గర ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ల్యాండ్ ఆక్వాకేషన్ చేసి ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చన్నారు.   తుమ్మిడి హెట్టి పై ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడారని.. అసెంబ్లీ కి ప్రతిపక్ష నేత ఎందుకు రాలేదు అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆ విషయం రేవంత్ కూడా తెలుసన్నారు.  ఒక్క రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని,పట్టుకొని ఇలా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. సచివాలయంలో విలేకరులకూ స్వేచ్చ లేదన్నారు.