హైదరాబాద్/ జగిత్యాల: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్  నిర్వహించబోయే సభలపైనే ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ జగిత్యాల సభతో ప్రజల ముందుకు రానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి కేసీఆర్ ఎలాంటి విమర్శలు చేస్తారనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

Continues below advertisement

జగిత్యాల సభకు అందుబాటులో లేని హరీష్ రావు..

ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ కీలక నేతల్లో ఒకరైన ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల బహిరంగ సభకు అందుబాటులో ఉండటం లేదు. ఆయనతో పాటు బి. వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం ఢిల్లీలో సీనియర్ లాయర్లతో సమావేశమై కొన్ని కీలక అంశాలపై చర్చించనున్నారు.    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టులో ఇదివరకే పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.  

Continues below advertisement

ఏప్రిల్ 8న వెల్లడించాల్సిన తీర్పును హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. తీర్పు కనుక తమకు వ్యతిరేకంగా ఏం చేయాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఢిల్లీలో సీనియర్ లాయర్లతో చర్చించడానికి హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడంతో ఆయన లేకుండా కేసీఆర్, కేటీఆర్ జగిత్యాల సభను నడిపించనున్నారు. ఏడాది తరువాత కేసీఆర్ హాజరై ప్రసంగించనున్న సభకు హరీష్ రావు అందుబాటులో లేకపోవడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. 

కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ మార్క్ పంచ్‌లు !అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలును కేసీఆర్ అస్త్రంగా మార్చుకోనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన బహిరంగ సభలకు దూరంగా ఉంటూ, కొత్త ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చారు. అయితే, ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన ముగియడంతో, రైతులు, ఇతర వర్గాల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ఈ సభ ద్వారా ఎండగట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. గత ఏడాది వరంగల్ ప్లీనరీ తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న భారీ సభ ఇదే కావడంతో, ఆయన దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

జగిత్యాల - బీఆర్‌ఎస్‌కు సెంటిమెంట్ వేదిక జగిత్యాల గడ్డపై కేసీఆర్ నిర్వహించిన సభలన్నీ విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయి. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ జరిగిన తొలి సభతోనే బీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అలాగే, 2003లో ధర్మపురిలో కేసీఆర్ చేసిన సింహగర్జనతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం దిగివచ్చి గోదావరి పుష్కరాలకు నిధులు కేటాయించాల్సి వచ్చింది. ఇలా జగిత్యాల వేదికగా జరిగిన ప్రతి పోరాటం తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరిని పోసింది.

సభపై భారీ ఆశలు - పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 2004లో ఎంపీగా కేసీఆర్, ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి పొత్తులో గెలిచిన నేపథ్యం కూడా ఈ జిల్లాకు ఉంది. ఇప్పుడు అదే జిల్లా నుంచి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. జగిత్యాల మినీ స్టేడియంలో జరిగే ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి భారీగా జనం తరలివచ్చేలా ఇన్‌చార్జులను నియమించి జన సమీకరణ చేపట్టారు.