Telangana Tims Politics Harish Vs Congress: ఆరోగ్య రంగంలో తెలంగాణను నిర్వీర్యం చేశారని ప్రభుత్వంపై హరీష్ రావు  విరుచుకుపడ్డారు. ఎల్బీనగర్‌లో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని హరీష్ రావు పరిశీలించారు.  వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని .. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన నిర్మాణం ఇంకా సాగుతోందన్నారు.  లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.  

Continues below advertisement

వందేళ్ల ముందు చూపు కేసీఆర్ ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీదన్నారు.  రెండేళ్లుగా టిమ్స్ ఆసుపత్రులను పడావు పెట్టారని..  కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమన్నారు.   కరోనా తర్వాత వందేళ్ల ముందు చూపుతో హైద్రాబాద్ చుట్టూ నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు నిర్మించాలని కేసీఆర్  తలపెట్టారని..  టిమ్స్ లతో పాటు, నిమ్స్ రెండు వేల పడకల ఆసుపత్రి నిర్మించాలని శంకుస్థాపన చేశారన్నారు.  గతంలో అనేక ప్రభుత్వాలు పని చేసినా నిజాం కాలంలో కట్టిన గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి ఆసుపత్రులే ఉన్నాయని..  అందుకే పనులు ప్రారంభించిన కేసీఆర్ దాదాపుగా పూర్తి చేశారన్నారు. 

 కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు ముందుకు పోవడం లేదు.. భూసేకరణ, టెండర్లు, డిజైన్లు పూర్తి చేసింది, నిధులు ఇచ్చింది... సెల్లార్ తో కలుపుకొని 6 అంతస్తుల భవనం ఎల్బీ నగర్ టిమ్స్ పనులను బిఆర్ఎస్ పూర్తి చేసింది. కానీ అప్పటి నుండి రెండేళ్లలో 5 అంతస్తులు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు.  బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఆసుపత్రి పనులు ప్రారంభమై, ప్రజలకు సేవలు అందించేందన్నారు.   మేము మహేళ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీ శాంక్షన్ చేస్తే, జీవో జారీ చేస్తే, దాన్ని రద్దు చేసారు. శంకుస్థాపన చేసిన కాలేజీని రద్దు చేసి, టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేశారన్నారు.  వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని  హరీష్ రావు డిమాండ్ చేశారు.  బస్తీ దవాఖానలను ఆపేశారన.ి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు.  కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు, బతుకమ్మ చీరెలు ఆపేశారు..  కేసీఆర్ ప్రారంభించిన పథకాలను ఆపడం తప్ప, మీరు చేస్తున్నదేం లేదన్నారు.  

హరీష్  కు కాంగ్రెస్ కౌంటర్ 

జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల వ‌చ్చే స‌రికి హ‌రీష్ రావు కు స‌మ‌స్య‌లు గుర్తుకు వ‌చ్చాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.  న‌గ‌ర ప్రజ‌లను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి ఆయ‌న హ‌డావిడి మొద‌లు పెట్టాడని మండిపడ్డారు.  కొత్త పేట టిమ్స్ హాస్పిట‌ల్ ద‌గ్గ‌ర హ‌రీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు షో చేశారని..  హాస్పిటల్ నిర్మాణం జ‌ర‌గ‌డం లేద‌ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..  ప‌దేళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూప‌ర్ స్పెషాలిటీ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ఎందుకు నిర్మించ‌లేదో హ‌రీష్ రావు స‌మాధానం చెప్పాలన్నారు.   అధికారం పోవ‌డానికి యేడాది ముందు టిమ్స్ హాస్పిట‌ల్స్ కు టెండ‌ర్లు పిలిచారు.. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక ముఖ్మ‌మంత్రి వీటిని నిర్మాణంపైన ప్ర‌త్యేక ద్రుష్టి సారించారు.. అన్ని ఆస్ప‌త్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తైందన్నారు.  సూప‌ర్ స్పెషాలిటి హాస్పిట‌ల్ హంగులతో పాటు అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు,ఆధునిక ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌ను నిర్మిస్తున్నామని.. విదేశాల నుంచి వైద్య ప‌రిక‌రాలు రావాల్సి ఉండ‌టం వ‌ల్ల ప్రారంభోత్స‌వానికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉందన్నారు.  పేరు కోసం ఆద‌రాబాద‌రా గా ఆస్ప‌త్రుల‌ను ప్రారంభించాల‌నుకోవ‌డం లేదని..  ఉస్మానియా ఆస్ప‌త్రి వ‌ర‌ద‌ల్లో మునిగిపోయినా క‌నీసం ప‌ట్టించుకోలేదు... మా ముఖ్య‌మంత్రి గోషా మ‌హ‌ల్ అత్యాధునిక  సౌక‌ర్యాల‌తో ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు.. కాంట్రాక్టు సంస్థ ఇప్ప‌టికే నిర్మాణ ప‌నులు మొద‌లు పెట్టిందని గుర్తు చేశారు.  ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌ను ప‌దేళ్ల పాటు గాలికి వ‌దిలేసి ఇప్పుడు హ‌రీష్ రావు మాకు పాఠాలు చెపుతున్నాడని హ‌రీష్ రావు,కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు.