BRS Mlas Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను, పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలవడంతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Continues below advertisement






Also Read: Sridhar Babu: హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనున్న రష్యా దిగ్గజ కంపెనీ