Rains in AP and Telangana | హైదరాబాద్: మొంథా తుపాను తీరం దాటినా నాలుగైదు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో రాబోయే గంటల్లో తెలంగాణ, తీర ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాలలో కొన్నిచోట్ల తక్కువ నుండి మధ్యస్థ స్థాయి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
హెచ్చరిక జారీ చేసిన జిల్లాలు:ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం & యానం: గుంటూరు, ప్రకాశం జిల్లాలు
తెలంగాణలో ప్రాంతాలుఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాలు
మరాఠవాడా సమీప ప్రాంతాలు: నాందేడ్, హింగోలి, పర్బణీ
విదర్భా ప్రాంతం (మహారాష్ట్ర): బుల్దానా, అకొలా, అమరావతి, వార్ధా, యవత్మాల్, నాగ్పూర్ జిల్లాలు
తక్కువ ఎత్తు ప్రాంతాలు, ఇతర చోట్ల నీటి నిల్వ ఒక్కసారిగా పెరుగుతుంది. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నీట మునిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తదుపరి 6 గంటల్లో తీర ఆంధ్రప్రదేశ్‌లో, తదుపరి 24 గంటల్లో తెలంగాణ, విదర్భా, మరాఠవాడాలో తీవ్ర వర్షపాతం వల్ల ఒకేచోట నీరు ఎక్కువగా నిలిచే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలకు ఐఎండీ సూచనలు:- వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి.- వాగులు, కాల్వలు, చెరువుల దగ్గర తిరగవద్దు.- ప్రయాణం ముందు వాతావరణ సమాచారం తెలుసుకోండి.- రైతులు పంటలు, పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి.- స్థానిక అధికారులు అత్యవసర సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని సూచించింది.
అత్యవసర పరిస్థితుల్లో మీ జిల్లా డిజాస్టర్ కంట్రోల్ రూమ్ లేదా స్థానిక సహాయ కేంద్రానికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. IMD, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నుంచి, మంత్రులు, అధికారుల నుంచి జారీ అయ్యే తాజా సూచనలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేశారు.