తెలంగాణ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ పురపాలకశాఖ జీవో జారీ చేసింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అని ఈసీ పేర్కొంది. ఈ విషయమై పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లను హెచ్చరించాలని సీఎస్‌కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. 


Also Read:  గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...


గౌరవ వేతనం పెంపు ఉత్తర్వులు ఉపసంహరణ


ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం గత నెలలో ఉపసంహరించుకుంది. హైదరాబాద్‌ సహా ఇతర నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, కార్పొరేటర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లకు, కోఆప్షన్‌ సభ్యులకు రవాణా భత్యంతో పాటు గౌరవ వేతనాలు 30 శాతం పెంచుతూ ముందు నిర్ణయం తీసుకుంది. మేయర్ల నెలసరి వేతనం రూ.50 వేల నుంచి రూ.65 వేలకు, ఉప మేయర్ల వేతనం రూ.25 వేల నుంచి రూ.32,500, కార్పొరేటర్లకు రూ.6000 నుంచి రూ.7800కి పెంచింది. 50 వేల జనాభా దాటిన పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్లకు రూ.15,000 నుంచి రూ.19,500, ఉప ఛైర్‌పర్సన్లకు రూ.7500 నుంచి రూ.9750, కౌన్సిలర్లకు రూ.3500 నుంచి రూ.4550కి పెంచింది. అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 


Also Read:  ఒమిక్రాన్‌ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది... విద్యాసంస్థల్లో కరోనా కేసులపై ఆందోళన వద్దు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి


12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు 


స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవ్వగా 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 14న ఓట్లను లెక్కింపు ఉంటుంది. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. 


Also Read: పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు... కీచక టీచర్ కు దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి