ED again issued notices to KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. మొదట జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆయన మంగళవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు రావాల్సి ఉన్నందున సమయం కావాలని లేఖ రాశారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు కేటీఆర్‌కు నిరాశ కలిగించింది. కేసులు, అరెస్టుల విషయంలో ఎలాంటి ఈరట లభించకపోవడంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ీ సారి మరింత సమయం ఇచ్చింది. పదహారో తేదీన హాజరు కావాలని సూచించింది.
ఈ కేసులో ఏ టుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుుమార్, ఏ త్రీగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. తమకు సమయం కావాలని కోరారు. దాంతో వారికీ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాతనే కేటీఆర్ ను ప్రశ్నించాలని ఈడీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఏసీబీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. తొమ్మిదో తేదీన వారి ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది ఈ సారి కారణాలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అరెస్టు చేసేందుకు ఇప్పుడు ఏసీబీకి ఎలాంటి అడ్డంకులు లేవు.
మరో వైపు ఈ అంశంపై కేటీఆర్ పార్టీ నేతలతో కేటీఆర్ విస్తృతంగా చర్చిస్తున్నారు . న్యాయపరమైన పోరాటం సాగించాలా లేకపోతే రాజకీయంగానే తేల్చుకోవాలా అన్న అంశంపై ఆయన అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. న్యాయపరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటే ఆయన ఎదుట రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కు వెళ్లడం, లేదా సుప్రీంకోర్టు కు వెళ్లడం . దీనిపై న్యాయనిపుణులతో కూడా కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.
న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో స్పందించారు. సత్యంకోసం తన పోరాటం సాగుతుందన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తాను, న్యాయం గెలుస్తుందని నా అచంచలమైన నమ్మకం త్వరలో ప్రపంచం కూడా చూస్తుందన్నారు.
నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు. వారితో పార్టీ వ్యవహారాలపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. తర్వాత ఏసీబీ, ఈడీ ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నదానిపై నిపుణులతో చర్చిస్తున్నారు. అవి వేసే అడుగులకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్నదానిపై బీఆర్ఎస్ వ్యూహకర్తలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.