Work From Park: రోజూ నాలుగు గోడల మధ్యే కూర్చొని ఉద్యోగం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’తో విసిగిపోయి కొత్తదనం కోరుకుంటున్నారా? అలాంటి వారి కోసం సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (సీఎంసీ) ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. దుబాయ్‌లో సక్సెస్ అయిన ‘వర్క్‌ ఫ్రం పార్క్‌’ థీమ్‌ను సైబరాబాద్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, స్టార్టప్‌ల నిర్వాహకులు ప్రశాంతమైన వాతావరణంలో పని చేసుకునేందుకు వీలుగా పార్కులను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది.

Continues below advertisement

ఆఫీసు సౌకర్యాలతో పార్కులు  

కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 30 పార్కులను 'వర్క్‌ ఫ్రం పార్క్‌' కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి విడతలో రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.

  1. మజీద్‌బండ (మాధవహిల్స్‌)- శేరిలింగంపల్లి జోన్‌లోని 1.5 ఎకరాల పార్కు
  2. మాదాపూర్‌- కూకట్‌పల్లి పరిధిలోని 1 ఎకరా విస్తీర్ణంలో పార్కు 

ఈ పార్కులను జనవరి 1 నాటికి ప్రారంభించనున్నట్లు సీఎంసీ కమిషనర్ సృజన శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే ఈ తరహాలో పార్కులను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. Also Read: చిలకలగూడలో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం!

Continues below advertisement

పార్కుల్లో సకల సౌకర్యాలు 

  • ఎత్తైన చెట్ల మధ్య ప్రత్యేక గదులు, కుర్చీలు
  • ఫ్రీ హై-స్పీడ్ వైఫై  
  • కో-వర్కింగ్ సీటింగ్, కెఫెటేరియా
  • స్టార్టప్ థీమ్ మీటింగ్ హాల్స్, యాంపి థియేటర్
  • వాకింగ్ ట్రాక్, టాయిలెట్స్ 
  • ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయం
  • సీసీ కెమెరాలతో పూర్తి సెక్యూరిటీ

ఈ పార్కులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. కేవలం నామమాత్రపు ఛార్జీలతో వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తొలి విడతలో వచ్చే రెస్పాన్స్ ను బట్టి మిగిలిన 28 పార్కులను కూడా ఇదే తరహాలో తీర్చిదిద్దనున్నట్లు కమిషనర్ తెలిపారు. Also Read: TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం