congress MLA Rajesh Reddy | నాగర్ కర్నూల్ మండలం తూడుకర్తి గ్రామంలో pacs వారి ఆధ్వరంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన ధర లభించేలా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం ఈ కొనుగోలు కేంద్రాల్లో A గ్రేడ్ వరికి క్వింటాల్‌కు ₹2389, అలాగే సాధారణ రకం (C గ్రేడ్) వరికి ₹2369 చొప్పున చెల్లింపు జరగనున్నదని వివరించారు. 

Continues below advertisement


పంట సేకరణలో పారదర్శకత..
రైతులు ఎలాంటి మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే సూచించారు. పంట సేకరణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రైతుకూ సమయానికి చెల్లింపులు జరిగేలా వ్యవస్థను పటిష్ఠం చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ సీజన్‌లో రైతులు పంట నాణ్యతపై దృష్టి పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అందించే సౌకర్యాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు.




ఈ కార్యక్రమంలో  PACS ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మండల్ ప్రెసిడెంట్ కోటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ కౌన్సిలర్స్, డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి కో-కో (U/17) బాల, బాలికల క్రీడా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విద్యార్థులను ఉత్సాహపరిచారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, జట్టు భావన పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.