Congress decides to hold public meetings: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఫిబ్రవరి 3 నుండి 9 వరకు ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సభలు సాగనున్నాయి. ఫిబ్రవరి 3న మొదటి సభ మహబూబ్ నగర్‌లో జరగనుంది.  

Continues below advertisement

ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం బహిరంగసభలు                             ఈ బహిరంగ సభల ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల విజయాలను ప్రజలకు వివరించడం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులతో నేరుగా మమేకమై, ప్రభుత్వ పనితీరుపై సానుకూల వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఈ సభల్లో పాల్గొంటారు. ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై స్పందించడంతో పాటు, నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.          

జల వివాదాలపైనా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని  తిప్పికొట్టాలని ప్రయత్నాలు               

Continues below advertisement

ఇటీవలి కాలంలో ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ సభలను వేదికగా మార్చుకోనున్నారు. జల వివాదాలు, నిరుద్యోగ భృతి ,  ఇతర హామీలపై విపక్షాల ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చేలా వ్యూహరచన చేస్తున్నారు. మున్సిపల్ ,  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న  తరుణంలో, ఈ  బహిరంగసభలు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం,  ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరుచుకోవడం ఈ సభల వెనుక ఉన్న అసలు వ్యూహం అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

బీఆర్ఎస్ బహిరంగసభలు ఎప్పటి నుంచి ?               

ఇప్పటికే భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బహిరంగసభలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. దక్షిణ తెలంగాణలోని మూడు జిల్లాల్లో బహిరంగసభలను పదిహేను రోజుల్లో నిర్వహిస్తామని రెండు వారాలా కిందట నిర్వహించి ప్రెస్మీట్లో ప్రకటించారు. ఆ తర్వాత బహిరంగసభల నిర్వహణ గురించి పార్టీ నేతలతో మాట్లాడారు. కానీ ఇప్పటి వరకూ  తేదీలను ఖరారు చేయలేదు.మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఈ సభలు పెట్టాలనుకున్నారు.  బీఆర్ఎస్ కంటే ముందుగానే కాంగ్రెస్ బహిరంగసభలు పెట్టి బీఆర్ఎస్ చేస్తున్నప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణియంచుకుంది. ఏకంగా తొమ్మిది జిల్లాల్లో సభలు పెట్టాలని నిర్ణయించడంతో బీఆర్ఎస్ పార్టీ అంత కంటే ముందే సభలు నిర్వహిస్తుందా లేకపోతే..  వాయదా వేసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.