CM Revanth Reddy challenged Kcr: నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యామిలీని మళ్లీ అధికారంలోకి రానివ్వను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  80 శాతానికిపైగాసీట్లు సాధించి రెండో సారి అధికారంలోకి వస్తుందన్నారు.  తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎన్నికయిన  సర్పంచ్ ఎన్నికల అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన   భారీ బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.   

Continues below advertisement

వచ్చే 2029 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. "రాసిపెట్టుకోండి.. 2029లో 80 శాతానికి పైగా అసెంబ్లీ సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది" అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ, ఇందిరమ్మ రాజ్యం పదేళ్ల పాటు కొనసాగుతుందని, అప్పుడే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారి రాజకీయ అస్థిత్వానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.    తన పాలనపై కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి  ఘాటుగా తిప్పికొట్టారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు, ఇప్పుడు అధికారం కోసం దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు. తాను  చనిపోవాలని పదే పదే  కోరుకుంటున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలు విరగ్గొట్టున్నారని..ఆయనను తాను ఏమీ అనలదేన్నారు.   తోలు తీస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌లో ఉండి తోలు తీయడం నేర్చుకున్నారని.. మటన్ కొట్టు మస్తాన్ వద్దకు  రా అని వ్యాఖ్యానించారు. ఎవరి తోలు తీస్తారో తేల్చుకుందామని.. సర్పంచ్‌‌ల వద్దకు రావాలన్నారు.  చింతమడకలో చీరి చింతకు కడతామని  వార్నింగ్ ఇచ్చారు.    

నలభై ఏళ్ల అనుభవం ఉన్న మాటలు మాట్లాడే మాటలేని అవి అని  కేసీఆర్ పైమండిపడ్డారు.  మాకు మాటలు రాక కాదు… మర్యాద ఉండదని మాట్లాడటం లేదన్నారు.  రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నాడు.. ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదు  నేనేం పాస్ పోర్టు బ్రోకర్ దందా చేయలేదు.. అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదు.. మేం కక్షా రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వాళ్లే పోతారని మా పని మేం చేసుకుంటున్నామన్నారు. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. అని సవాల్  చేశారు.  ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం  అన్నారు.  కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి అని పిలుపనిచ్చారు. సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోందన్నారు.  

Continues below advertisement

కేసీఆర్ తరహాలో తాను మాట్లాడితే   ఉరేసుకుంటాడాన్నారు.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు  తనను జైలుకు పంపడమే కాక తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడన్నారు. అయినా  ఆయన పాపానికి ఆయనే  పోతామని వదిలేశామన్నారు. కేసులు కూడా పెట్టలేదని.. కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. మా వాళ్ల  మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారని గుర్తు చేశారు. తానేమీ దుబాయ్ పాస్ పోర్టుబ్రోకర్ గా చేయలేదని.. రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదని రేవంత్ గుర్తు చేశారు. తండ్రీ,కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మానేసి.. పార్టీ ఆఫీసులో కాదని.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు.  

కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తండ్రి గాలికి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కవితను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డకు చీరపెట్టని వాడు.. చెల్లి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలని  వాడు తనకు సవాల్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడ్నికాదని.. ఎన్ని సార్లు అయినా  అసెంబ్లీ పెడతామని సవాల్ చేశారు.  "ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కొడంగల్ బిడ్డగా నేను చెబుతున్నా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ కనుమరుగు కావడం ఖాయం" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి  ఉంటుందని హామీ  ఇచ్చారు.