భారతీయ సినిమా గురించి... ఆ మాటకు వస్తే మన తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన పాట 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు' (Naatu Naatu Song). ఆస్కార్ సాధించిన తొలి తెలుగు పాటగా, భారతీయ పాటగా రికార్డ్ సృష్టించింది. 'నాటు నాటు' పాడిన గాయకులలో ఒకరైన తెలంగాణ యువకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసల వర్షం కురిపించారు.
యువతకు ఆదర్శం... కోటి నజరానా!CM Revanth Reddy On Rahul Sipligunj: తెలంగాణ యువతకు రాహుల్ సిప్లిగంజ్ ఆదర్శం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసచారు. సొంత కృషితో అతను పైకి ఎదిగాడని పేర్కొన్నారు. ఆస్కార్ సాధించిన పాట వెనుక రాహుల్ కృషి ఉందని తెలిపారు. యువత అతడిని మార్గదర్శిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అంతే కాదు... అతడికి కోటి రూపాయల నజరానా కూడా ప్రకటించారు.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాలో రాశీ ఖన్నా... ఆల్రెడీ షూటింగ్ షురూ... ఎందులోనో తెలుసా?
గద్దర్ అవార్డులో ప్రకటించిన సమయంలోనూ రాహుల్ సిప్లిగంజ్ గురించి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. అతడికి పురస్కారం ఏమీ రాలేదని, భవిష్యత్తులో ఏదైనా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చిత్రసీమకు ఎటువంటి అవార్డులు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డులు ప్రకటించారు. గతేడాది విడుదలైన అన్ని సినిమాలలో అన్ని విభాగాలకూ అవార్డులు ఇచ్చారు. పదేళ్ల కాలంలో ప్రతి ఏడాది విడుదలైన సినిమాల్లో కేవలం సినిమా విభాగంలో అవార్డులు ఇచ్చారు తప్ప మిగతా విభాగాలలో ఎటువంటి ఆ పురస్కారాలు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పంట పండింది.
Also Read: బికినీలో ప్రియాంక చోప్రా... బర్త్ డే సెలబ్రేషన్స్ డంప్ చూడండి
'నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చి రెండేళ్లు దాటింది. ఇప్పుడు పాట పాడిన గాయకుడికి తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించడం విశేషం. ఆస్కారం వచ్చిన సమయంలో తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలోనే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతడికి నజరానా ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు, యువ స్వరకర్త కాలభైరవ కూడా రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి ఆ పాట పాడారు.