Telangana Cabinet Ministers : తెలంగాణ మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిని మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.                                                    
  


మంత్రుల   శాఖలు  


ఉత్తమ్-హోంశాఖ


దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ


భట్టి విక్రమార్క- రెవెన్యూ


కోమటిరెడ్డి-మున్సిపల్


తుమ్మల-రోడ్డు, భవనాల శాఖ


పొంగులేటి-ఇరిగేషన్


శ్రీధర్‌బాబు-ఆర్ధిక శాఖ


సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ


జూపల్లి-సివిల్ సప్లై


పొన్నం-బీసీ సంక్షేమశాఖ


కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ



సాధారణంగా డిప్యూటీ సీఎం హోదా ఇస్తే..  హోంమంత్రిత్వ శాఖ ఇస్తారు. కానీ భట్టి విక్రమార్కకు రెవిన్యూ శాఖను ఇచ్చారు. మరో వైపు సీతక్కను హోంమంత్రిని చేస్తారన్న ప్రచారం జరిగింది. నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. హోంమంత్రి అయితే చరిత్ర సృష్టించినట్లు అయ్యేది. కానీ.. సీనియర్లు తీవ్రంగా పట్టుబట్టడంతో వారికి కీలక శాఖలు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఉత్తమ్ కు  హోంమంత్రి ఇవ్వడంతో  మాజీ పీసీసీ చీఫ్ కు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని అభిప్రాయం కాంగ్రెస్ లో వినిపిస్తోంది.                                                


మరో వైపు   ఇలా సీఎంగా బాధ్యతలు చేపట్టగానే అలా పాలనా వర్గాల్లో  మార్పులు ప్రారంభించారు. డీజీపీ కన్నా ముందు ఇంటలిజెన్స్ చఫ్ ను మార్చేశారు. బి.శివధర్ రెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్ ను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారు. కీలక రాజకీయ పరిణామాలు ఉండే అవకాశం ఉన్నందున  ముందుగా ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకున్నారు. తర్వాత సీఎం వ్యవహారాలు చూసేందుకు శేషాద్రి అనే అధికారిని నియమించారు.                                       


నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి  తెలంగాణ మొదటి ఇంటలిజెన్స్ చీఫ్. కేసీఆర్ తొలి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయననే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. కానీ రెండేళ్లలో మార్చేశారు. అసలేమయిందో తెలియదు కానీ అప్పట్నుంచి ఆయన లూప్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏడీజీగా రైల్వేస్ , రోడ్ సేఫ్టీలో ఉన్నారు. ఆయన ను రేవంత్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించడం ఆసక్తికరంగా మారింది.