CM Revanth announces compensation for Telangana flood victims: తెలంగాణలో తుపాన్ మొంథా కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఏరియల్ వ్యూ చేసిన  తరవాత వరంగల్‌లో బాధితుల్ని పరామర్శించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు.  క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని అధికారుల్ని ఆదేశించారు.  ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోవాలన్నారు.  ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలన్నారు. 

Continues below advertisement

ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వాలని..  తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలన్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడంలో అలసత్వం వద్దు ..కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టుకుంటుందని స్పష్టం చేశారు.  తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.  సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని..  అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.    

నాలాల కబ్జాలను తొలగించాల్సిందే.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని..  పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు.  దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేని.. వరదలు తగ్గిన నేపథ్యంలో శానిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.  వరదల్లో ప్రాణ నష్టం జరిగినచోట రూ. 5 లక్షలు పరిహారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఇందుకు సంబధించి వివరాలు సేకరించాలన్నారు.  పంటనష్టం, పశు సంపద నష్టపోయిన చోట వారికి పరిహారం అందించాలని.. ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకునేందుకు అంచనాలు వేయాలన్నారు.     

ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని..  ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు.  మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి ..స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని.. ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని స్పష్టం చేశారు.  క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలన్నారు.  వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైంది.  దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.  అధికారులు నిర్లక్ష్యం వదలండి క్షేత్రస్థాయికి వెళ్లాలని.. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందేనన్నారు.