తెలంగాణ రాష్ట్రంలో సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీకి సిద్ధం అవుతున్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనబెరి, సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదని, ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తామని అన్నారు. 


ఇంతకుముందు లాగానే పొత్తులు అంటూనే ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. ఏది ఏమైనా తమకు బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెడతామని అన్నారు. మతోన్మాద బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామని పునరుద్ఘాటించారు. కమ్యూనిస్టు పార్టీలను సంప్రదించకుండానే సీఎం కేసీఆర్ ఏకంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారని అన్నారు. 


మునుగోడు ఉప ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని వామపక్షాలు భావించిన సంగతి తెలిసిందే. వామపక్షాల పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో వారికి భంగపాటు ఎదురైంది. ఈ ప్రవర్తనపై సీపీఐ, సీపీఎం నేతలు మండిపడ్డారు. అనంతరం వారు సమావేశమై తమకు బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


ఈరోజు దరఖాస్తు చేసిన వారు వీరే


ఈ రోజు దరఖాస్తు చేసుకున్న వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి,  ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సీడబ్యుసీ సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు.


ఈ రోజుతో దరఖాస్తు గడువు ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ వారి వారి నియోజక వర్గాలలో దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి మాత్రం ఇంతవరకూ ఎక్కడా దరఖాస్తు చేయలేదు.