అన్వేషించండి

CBI Kavita : 11వ తేదీన వస్తాం - కవితకు సీబీఐ రిప్లై !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో11వ తేదీన వచ్చి వివరణ తీసుకుంటామని సీబీఐ అధికారులు కవితకు సమాచారం పంపారు. ఆరో తేదీన కుదరదని.. రాసిన లేఖకు సీబీఐ అధికారులు ఈ మెయిల్ ద్వారా స్పందించారు.

 CBI Kavita :    ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11వ తేదీన సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద వివరణ తీసుకోనున్నారు. ఆరోతేదీన వస్తామన్న సీబీఐ అధికారులు ఈ రోజు ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు రాలేదు. ఆరో తేదీన విచారణకు సహకరించాలని గత వారం కవితకు  సీబీఐ అధికారులు లేఖ రాశారు. ఢిల్లీలో లేదా హైదరాబాద్‌లో అయినా పర్వాలేదన్నారు. ఆ లేఖను స్పందించిన కల్వకుంట్ల కవిత  ఆరో తేదీన తన ఇంట్లో అందుబాటులో ఉంటానని సమాధానం ఇచ్చారు.  అయితే తర్వాత న్యాయనిపుణులు, తన తండ్రి సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత వ్యూహం మార్చుకున్నారు. తనకు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. వాటిని సీబీఐ వెబ్ సైట్‌లో ఉంచినట్లుగా సమాచారం రావడంతో ... పరిశీలించి...అందులో నిందితురాలిగా తన పేరు లేదని.. అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని చెప్పారు. 

డిసెంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంలో వివరణ తీసుకోవడానికి వస్తామని కవితకు సీబీఐ లేఖ 

కానీ ఆరో తేదీన అందుబాటులో ఉండనని చెప్పారు.  ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని లేఖ రాశారు.  కానీ ఆ లేఖకు సీబీఐ నుంచి ఆరో తేదీన సాయంత్రం వరకూ స్పందన రాలేదు. మరో వైపు అధికారులు కూడా రాకపోవడంతో ఈ అంశంపై కవిత న్యాయనిపుణులతో సంప్రందిపులు జరిపారు. అయితే ఆరో తేదీ సాయంత్రానికి సీబీఐ నుంచి రిప్లయ్ వచ్చింది. 11వ తేదీన అందబాటులో ఉండాలని ఆ రిప్లైలో సీబీఐ అదికారులు కోరారు. 

సీబీఐ అధికారుల వ్యూహంపై న్యాయనిపుణులతో కవిత మంతనాలు
 
ఈ అంశంపై  టీఆర్ఎస్ తరపున న్యాయనిపుణులు తర్వాత ఏం జరగొచ్చో అన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే సీబీఐ ఇచ్చిన నోటీసు ప్రకారం ఆమెను సాక్షిగానే పిలుస్తున్నారు. ఫిర్యాదులో కానీ.. ఎఫ్ఐఆర్‌లో కానీ ఆమె పేరు లేదు. అయితే   ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను టార్గెట్ చేసి.. తీవ్ర ఆరోపణలను బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా వారు వాదిస్తున్నారు. అందుకే ఆ దిశగానే ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఫిర్యాదులో కానీ .. ఎఫ్ఐఆర్‌లో కానీ కవిత పేరు లేదు. అయితే జరుగుతున్న రాజకీయం మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క సారిగా వ్యూహం మారుస్తాయని.. కవితను నిందితురాలిగా చేర్చి అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే టీఆర్ఎస్ తరపున న్యాయనిపుణులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. 

కవిత రాసిన లేఖకు ఆలస్యంగా స్పందించిన సీబీఐ అధికారులు

కవిత రాసిన లేఖకు సీబీఐ అధికారులు స్పందిస్తారని.. ఆమె ఇచ్చిన తేదీల్లో ఏదో ఓ రోజు వస్తామని.. ఎప్పుడైనా సమాచారం పంపవచ్చని సీబీఐ వ్యవహారాలపై అవగాహన ఉన్న నిపుణులు అంచనా వేశారు. దాని ప్రకారం.. పదకొండో తేదీన వారు వివరణ తీసుకోవడానికి సిద్ధమని సమాచారం పంపారు.  ఇలా విచారణలు వాయిదా అడగడం సహజమేనని.. పైగా కవిత పూర్తిగా సాక్షి కోణంలోనే నోటీసులు జారీ చేశారని అంటున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget