BRS condemned Journalists arrest: ఓ మంత్రి, ఐఏఎస్ అధికారిణిలపై అనుచిత కథనాలు ప్రసారం చేశారన్న కారణంపై ఓ టీవీ చానల్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టుల్ని హైదరాబాద్ సీసీఎస్ అరెస్టు చేయడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు జర్నలిస్టులను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. వ రాహుల్ గాంధీని ఉద్దేశించి మీరు చెప్పే 'మొహబ్బత్ కా దుకాణ్' ఇదేనా?" అని ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు.
జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. డీజీపీకి ఫోన్ చేసి వెంటనే జర్నలిస్టుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఒక మహిళా ఉన్నతాధికారి - ఒక సీనియర్ మంత్రిపై అసభ్య కరమైన వార్తలను ప్రచురించడం యాదృచ్ఛికం కాదని మరో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇది ఒక లోతైన కుట్ర తోనే జరిగిందని నిజానికి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని రోకలిబండలు ఎక్కించాల్సింది ఆ న్యూస్ చానల్ యాజమాన్యం మీద అన్నారు.
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా అరెస్టులను ఖండించారు. పోలీసులు పండగపూట ఇలా అరెస్టు చేయడం సరి కాదన్నారు.
సదరు టీవీ చానల్ ఆఫీసులో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు.