ఈ 28న మధ్య ప్రదేశ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత


BRS MLC Kavitha to Visit Madhya Pradesh on 28 January: హైదరాబాద్: ఈ నెల 28వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్య ప్రదేశ్ ఓబీసీ హక్కులు ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఫ్రంట్ వ్యవస్థానకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే “పీడిత్ అధికార్ యాత్ర”ను ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు. 


ఓబీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్ కు మద్ధతుగా ఎమ్మెల్సీ కవిత అక్కడి ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కలు, డిమాండ్ల సాధన కోసం మధ్య ప్రదేశ్ కేంద్రంలో దామోదర్ సింగ్ యాదవ్ పోరాటాన్ని సాగిస్తున్నారు.


రౌండ్ టేబుల్ సమావేశానికి రావాలని అన్ని పార్టీలకు భారత్ జాగృతి ఆహ్వానం
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుపై 26న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న భారత్ జాగృతి
హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపై ఈ నెల 26న భారత్ జాగృతి ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని ఖాజా మాన్షన్ లో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలను జాగృతి నాయకులు ఆహ్వానించారు. భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులను జాగృతి నేతలు ఆహ్వానాన్ని అందించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు కూడా పాల్గొననున్నారు.