BRS MLA Talasani Srinivas Yadav Challenge: ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఆపే చట్టం తెస్తే.. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా - కోమటిరెడ్డికి తలసాని ఓపెన్ ఛాలెంజ్
Talasani Srinivas Yadav : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆంధ్రా కాంట్రాక్టుల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన సవాల్ విసిరారు. చట్టం చేస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు

Talasani Srinivas Yadav Resignation Challenge: హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభ వివాదం తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ రచ్చ కాస్తా ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వానికి దారితీసింది. ఆంధ్రా కాంట్రాక్టర్లకు సంబంధించి తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. మంత్రికి ఏకంగా తన పదవికే రాజీనామా చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే తలసాని ఓపెన్ ఛాలెంజ్
హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతకుముందు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఇక్కడ లేనిపోని రాజకీయాలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఎవరికీ కూడా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వం. కావాలంటే దీనిపై ప్రత్యేకంగా అసెంబ్లీలో ఒక చట్టం కూడా తీసుకువస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల వ్యాపార, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి.
రేవంత్ రెడ్డిని ఒప్పించి చట్టం తేవాలి - తలసాని సవాల్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మాటలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడుతూ నేరుగా కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అంత సినిమా ఉంటే.. ఆయన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి, ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వకుండా అసెంబ్లీలో చట్టం తీసుకురావాలి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం గనుక నిజంగానే ఆ చట్టాన్ని తీసుకువస్తే.. నేను నా ఎమ్మెల్యే పదవికి ఉన్నపళంగా రాజీనామా చేయడానికి రెడీ అంటూ తలసాని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్ట్ ఇవ్వకుండా చట్టం తెస్తారా?
— BRS Party (@BRSparty) June 3, 2026
నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ!
దమ్ముందా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @YadavTalasani సవాల్ 🔥 pic.twitter.com/2VgV9XfBpo
కాంగ్రెస్ లీడర్ల డ్రామా రాజకీయం
పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఒక చిన్న ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటే దానికి కాంగ్రెస్ నేతలు ఇంతలా భయపడిపోయి డ్రామాలు ఆడుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించి, లేని వివాదాన్ని కావాలనే పెద్దది చేసి మైలేజ్ పొందాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి కోమటిరెడ్డి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేలా చట్టాలు తెస్తామని మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ వ్యవస్థలో అలాంటి చట్టాలు తీసుకురావడం సాధ్యం కాదనే కనీస జ్ఞానం కూడా మంత్రికి లేదని తలసాని దుయ్యబట్టారు.
గ్రేటర్ ఎన్నికల ఓట్ల కోసమే ఈ విద్వేషాలు
ముంచుకొస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ తరహా సెంటిమెంట్ పాలిటిక్స్‌కు తెరలేపిందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పవన్ కల్యాణ్‌ను ఒక ఆంధ్రా లీడర్ గా చూపించి, ఆయనను టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడి ఓటర్లను మళ్లీ ప్రాంతాల వారీగా విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. గడచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఆంధ్రా, తెలంగాణ అనే తేడా లేకుండా అందరూ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకున్నారని.. కానీ కాంగ్రెస్ వచ్చిన కొద్దిరోజులకే పాత విద్వేషాలను మళ్లీ తవ్వి తీస్తోందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















