BRS First Reaction On Kavitha Comments: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు రావడం, ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడం వెనుక ఉన్న కారణాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు బాధ్యులు పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు, కేసీఆర్‌కు వెన్నంటి ఉండే సంతోష్ రావులే అని కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ స్పందించింది.
పార్టీ వాట్సాప్ గ్రూపులతో సహా, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి కవిత పీఏ శరత్‌ను, పీఆర్వో నవీన్‌ను తొలగించాలని పార్టీ కీలక నేతల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే శరత్‌ను పార్టీ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించారు. కవిత పార్టీలో చేరిన నాటి నుంచి శరత్ వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారు. ఇటీవలే నవీన్ రావు పీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరిని పార్టీ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించారు.
కవిత గత కొన్ని నెలలుగా పార్టీలోని ముఖ్యనేతలపై చేసిన విమర్శలు, తెలంగాణ జాగృతి కార్యక్రమాల వివరాలు బీఆర్ఎస్ పార్టీ మీడియా వాట్సాప్ గ్రూపుల నుంచే మీడియాకు ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే కవిత పార్టీ కీలక నేత హరీశ్ రావు, కేసీఆర్‌కు వెన్నంటి ఉండే సంతోష్ లపై చేసిన వ్యాఖ్యల అనంతరం వీరిని బీఆర్ఎస్ మీడియా వాట్సాప్ గ్రూప్ నుంచి వెంటనే తొలగించడం సంచలనంగా మారింది. ఇక కవితపైన కూడా పార్టీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.