KCR Vs Modi :  హైదరాబాద్‌లో 8వ తేదీన వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు.  రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ విముఖతతో  ఉన్నారు.  విమానాశ్రయంలో మోడీని కేసీఆర్‌ రిసీవ్‌ చేసుకోవడానికి కానీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ప్రొటోకాల్‌ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. 


ప్రధాని హోదాలో ఎవరున్నా స్థానిక ప్రభుత్వాధినేతగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లాంటి వీవీఐపీలు రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో సీఎం హోదాలో స్వాగతం పలకడం ఆన వాయితీ.  అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆహ్వానించారు. ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన  ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ లో కేసీఆర్‌ కూడా పాల్గొంటారని ఉంది. ఎనిమిదో తేదీ ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభించనున్నారు. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు.                                                  


మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్ కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అభివృద్ధి పనులు అధికారికం. అందుకే కేసీఆర్‌నూ ఆహ్వానించి .. ప్రసంగించేందుకు సమయం కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్‌ ను సంప్రదించకుండానే ఆయన  కోసం సమయం కేటాయించారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి ఆ చాన్సిచ్చారు. ఈ సారి కూడా ఆయనే స్వాగతం పలికే అవకాశం ఉంది.                                                


కొంత కాలంగా ప్రధాని మోదీతో కేసీఆర్ తీవ్రంగా  విబేధిస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. కనీసం సమావేశం అవడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా లేరు. గతంలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ను పిలువలేదని అందుకే ఈ సారి పిలిచినా వెళ్లకూడదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.