NVSS Prabhakar: వ్యవసాయ క్షేత్రంలో గడ్డి కోస్తూ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన ఉంగరాన్ని పోగొట్టుకున్నారు. అయితే ఇదే విషయాన్ని ప్రభాకర్ రాచకొండ సీపీకి తెలిపారు. తన ఉంగరం వెతికిపెట్టమని ఫిర్యాదు చేశారు. స్పందించిన రాచకొండ సీపీ ప్రత్యేక బృందంతో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా పంపారు. అక్కడకు వెళ్లిన సిబ్బంది వ్యవసా క్షేత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉంగరాన్ని వెతికిపెట్టారు. అయితే పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతికి పెట్టిన పోలీసులకు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
NVSS Prabhakar: గడ్డి కోస్తూ ఉంగరం పోగొట్టుకున్న బీజేపీ నేత- రంగంలోకి స్పెషల్ పోలీస్ టీం
ABP Desam | 07 Dec 2022 02:56 PM (IST)
NVSS Prabhakar: గడ్డి కోస్తూ బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఉంగరం పోగొట్టుకున్నారు. ఇదే విషయాన్ని రాచకొండ సీపీకీ చెప్పగా.. ప్రత్యేక సిబ్బందిని పంపించారు.

ఉంగరం పోగొట్టుకున్న బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వెతికి పెట్టిన రాచకొండ పోలీసులు!