Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని కోరుతోంది.
భారత మార్కెట్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. నిన్న నిలకడగా ఉన్న పసిడి ధర నేడు పుంజుకుంది. వెండి ధర కిలోకు రూ.200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.150 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,850 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత)పై రూ. 170 మేర పెరగడంతో ధర ప్రస్తుతం రూ.48,930 అయింది. ఇక వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు పెరిగింది. రూ.100 మేర పెరగడంతో తాజాగా కిలో రూ.67,900గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ శ్రీలంక తీరం దగ్గర్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి, నైరుతి బంగాళాఖాతం నుండి శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇదివరకే ఈ నెలలో రెండు వరుస అల్పపీడనాలు, వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. నవంబర్ 29 తేదీలోగా దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ లీటర్ ధర సైతం గత కొన్ని రోజులుగా రూ.86.67 వద్ద నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద స్థిరంగా ఉంది. గత రెండు వారాలుగా భాగ్యనగరంలో పెట్రోల్ ధర నిలకడగా కొనసాగుతుంది. డీజిల్ ధర సైతం లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.88 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107.69 కాగా, డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువగానే పెరిగింది. లీటరుకు రూ.0.46 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.111.13 అయింది. డీజిల్ ధర కూడా రూ.0.40 పైసలు పెరిగి రూ.97.14గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.111.13 కాగా, డీజిల్ ధర రూ.97.14 అయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్
శ్రీకాకుళం జిల్లా పలాసలో 108 వాహనాన్ని ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. స్టేషన్ లో ఉన్న పేషెంట్ ను తీసుకెళ్లేందుకు 108 వచ్చిన క్రమంలో ప్రమాదం జరిగింది. ప్లాట్ ఫామ్ పైకి వెళ్తోన్న క్రమంలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ 108 ను ఢీకొట్టింది. దీంతో 108 సిబ్బంది బయటకు దూకేశారు. దీంతో ఆనంద్ అనే 108 సిబ్బందికి భుజానికి గాయం అయ్యింది. 108 వాహనాన్ని ట్రైన్ 200 మీటర్ల వరకూ ఈడ్చుకువెళ్లింది.
కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
కడప జిల్లా రాజంపేటలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేస్తుంది. పులపుత్తూరు, మందపల్లి , అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం రానుంది.
కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
కడప జిల్లా రాజంపేటలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేస్తుంది. పులపుత్తూరు, మందపల్లి , అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలించేందుకు నలుగురు సభ్యుల కేంద్ర బృందం రానుంది.
అంగన్వాడీ పాలు, గుడ్లు తిని పది మంది చిన్నారులకు అస్వస్థత
శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లుతిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు తిన్న పది మంది చిన్నారులకు వాంతులు అయ్యాయి. ఇది గమనించిన అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు చిన్నారులను శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలుతోపాటు పాడైన కోడి గుడ్లు తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యినట్లు వైద్యులు చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తిని పిల్లలకు అస్వస్థత
అంగన్వాడీ కేంద్రంలో పాలు ,గుడ్లు తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు అంగన్వాడీ కేంద్రంలో
పాలు గుడ్లు తిన్న చిన్నారులకు వాంతులు అయ్యాయి. దీన్ని గమనించిన అంగన్వాడీ వర్కర్ ,స్థానికులు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి పది మంది చిన్నారులను తరలించారు . ముగ్గరు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యసేవలందిస్తున్నారు. పాలుతోపాటు పాడైన కోడి గుడ్లు తినడం వల్లనే విద్యార్దులు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తున్నారు.