Telangana Elections 2023 :  తెలంగాణలో బీజేపీకి ఓటు వేసి గెలిస్తే అయోధ్య రాముడి దర్శనం ఉచితం అని హోంమంత్రి అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన గద్వాలలో బహిరంగసభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  పూర్తి ఖర్చులు భరించి అయోధ్య రామాలయ దర్శనానికి తీసుకెళ్తామన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా  బీజేపీ ఇదే  హామీ ఇచ్చింది. మేనిపెస్టోలో పెట్టింది. తెలంగాణలో కూడా అదే  హామీ ఇవ్వడం ఆసక్తికరంగా  మారింది.  


బహిరంగసభలో  బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అని విమర్శలు గుప్పించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అబద్ధాపు ప్రచారాలతో ప్రజలన మోసం చేశారని ఫైర్ అయ్యారు. రూ. 70 కోట్లు జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రధాని మోడీ ఇచ్చారు, కానీ ఆ డబ్బులను కేసీఆర్ ఖర్చు చేయలేదని ఆరోపించారు. గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్‌ను కేసీఆర్ నిర్మించలేదన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడ్డారు.  కేసీఆర్ సర్కార్ బీసీలను మోసం చేసింది, కానీ బీజేపీ తెలంగాణలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. 


కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ ద్రోహులని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలని.. తెలంగాణలో ఈ పార్టీలకు విముక్తి కల్పించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందని అన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అమిత్ హామీ ఇచ్చారు. 
 


ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని..  బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.  డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.  బీఆర్ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందని..   అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ రికార్డు సృష్టించారని విమర్శఇంచారు.  గుర్రంగడ్డ వంతెనను ఇప్పటికీ పూర్తి చేయలేదు.  గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని చేయలేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామన్న హామీని సైతం నెరవేర్చలేదు.గద్వాలలో చేనేతల కోసం హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ పార్కు నిర్మించలేదు.  గద్వాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. 
 


బిజెపి కి అధికారమిస్తే ఐదేళ్లలో యువతకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని..  నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించింది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని గుర్తు చేశారు.  ఓవైసీకి లొంగిపోయి సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టలేదన్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.  ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు.