చదువులో ఉన్నత ప్రతిభ కనబర్చినా .. ఆర్దిక ఇబ్బందులు నిరుపేద కుటుంబాల విద్యార్దులనువెంటాడుతూనే ఉంటాయి. కష్టపడి పగలూ రాత్రి చదివి పరిక్షల్లో సత్తా చాటినా..ఆర్దిక సమస్యలు కుంగదీస్తాయి.ఉన్నత చదువులు ప్రశ్నార్దంగా మారుతాయి. ఇదే తరహాలో తాజాగా తెలంగాణాలోని నిరుపేద విద్యార్దులను ఆర్దిక ఇబ్బందులు వెంటాడాయి.దేశవ్యాప్తంగా జరిగిన మెడికల్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ లో తెలంగాణా సాంఘిక సంక్షేమ రెసిడెన్సియల్ ప్రతిభా కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్దులల్లో ఏకంగా 190 మంది విద్యార్దులు తమ ప్రతిభతో ప్రముఖ మెడికల్ కాలేజిలలో ఉచిత సీట్లు సాధించారు.ఉన్నత చదువలంటూ తెలియని గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ నిరుపేద కుటుంబాల నుండి వచ్చి  తెలంగాణా విద్యాశాఖకే మంచి పేరు తెచ్చిపెట్టారు.వైద్యులుగా సేవలందించాలనే కలలను సాకారం చేసుకుందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇక్కడి వరకూ అంతాబాగానే ఉంది. అస్సులు సమస్య ఇప్పడే మొదలైయ్యింది.


మెడికల్ కాలేజిలో ఉచిత సీటు సాధించిన వీరికి ఆయా కాలేజిలో చేరాంటే ఎంట్రన్స్ ఫీజు, హాస్టల్ ఫీజు ఇలా కనీసం లక్షన్నర చెల్లించాల్సి ఉంది. అంత మొత్తం చెల్లించే స్దోమత లేక చేతికి అందిన అవకాశం చేజారిపోతుందన్న ఆందోళతో ఉన్న విద్యార్దుల దీనావస్ద  "ABP దేశం" దృష్టికి వచ్చింది.  సిద్దిపేట జిల్లా  ఉస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన భువనగిరి సన్నీ ఆర్దిక ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. సన్నీ తండ్రి పొట్లపల్లి గ్రామపంచాయితీలో సఫాయి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నెలకు ఎనిమిదివేల జీతంతో ఐదు వందల కిరాయి ఇంట్లో నివసిస్తూ ఆర్దిక సమస్యలతో అతికష్టం మీద జీవనం సాగిస్తున్నారు.గాంధీ మెడికల్ కాలేజిలో ఉచిత సీటు సాధించిన భవనగిరి సన్నీ కాలేజిలో చేరాలంటే లక్షన్నర ఖర్చు చేయాలి. కుటుంబ పోషణ కష్టంగా మారిన పరిస్దితుల్లో లక్షన్నర ఎలా కట్టాలో తెలియక , చదువు ముందుకు కొనసాగేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 భవనగిరి సన్నీ దీనావస్దను వెలుగులోకి తెచ్చింది ABP దేశం. "భవిష్యత్ డాక్టర్లకు ఆర్దిక భరోసా ఏది.. ?" అంటూ గత నెలలో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. చదువే ప్రతిభ, డాక్టర్ కావాలనే కోరిక ఉన్నా.. సన్నీ కుటుంబాన్ని కుంగదీస్తున్న  ఆర్దిక సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియజేసింది.



ABPదేశం చేసిన ప్రయత్నానికి అపూర్వ స్పందన లభించింది. ఫీజు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్దితుల్లో ఉన్న భువనగిరి సన్నీదీనాస్దకు దాతలు స్పందిచారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి విద్యార్దికి లక్ష రూపాయలు ఆర్దిక సాహయం చేసి దాతృత్వం చాటుకున్నారు.ఎంపీ రంజిత్ రెడ్డి యాభై వేలు ఆర్దిక సహాయం చేసి ఆదుకున్నారు. ఇలా ABP దేశం చేపట్టిన సంకల్పంతో ఓ విద్యార్ది వైద్యుడు కావాలనే కలను సాకారం చేసుకోబోతున్నాడు. అడ్మిషన్, హాస్టల్ ఫీజుకట్టేందుకు అవసరమైన లక్షన్నర దాతల ద్వారా అందడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవదుల్లేవు. తమ దుస్దితిని వెలుగులోకి తెచ్చిన ABP దేశం కు ప్రత్యేక కృతజ్హతలు తెలిజేశారు సన్నీ కుటుంబ సభ్యులు.


సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీలేదనే విషయం మరోసారి నిరూపించింది ABP దేశం. సోషల్ మీడియాలో సంచలన కథనాలతో ఉనికి కాపాడుకోవడం కాదు జర్నలిజం అంటే.. భావితరాల భవిష్యత్ కు బాటలు వేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలంటూ మరోమారు గుర్తిచేసింది ABP దేశం.