Complaint On SriChaitanya AD :  టాలీవుడ్ హీరో  అల్లు అర్జున్ నటించిన  శ్రీచైతన్య విద్యాసంస్థల యాడ్‌లో వివాదాస్పదమవుతోంది.  కొత్త ఉపేందర్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బన్నీ నటించిన శ్రీచైతన్య వ్యాపార ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఫిర్యాదు చేశారు. ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ప్రకటిస్తూ.. శ్రీచైతన్యతో పాటు అల్లు అర్జున్‌పై ఉపేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.


ఆరో తేదీన పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన శ్రీ చైతన్య సంస్థలు 


 జూన్ 6 వ తేదీన వివిధ వార్త పత్రికల్లో ఇచ్చిన ఐఐటీ,, ( IIT ) యన్ ఐటి ( NIT ) ర్యాంకుల గురించి తప్పుడు ప్రకటన లపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఉపేందర్ రెడ్డి అందులో పది లక్షల మంది ఇంజినీర్లు, 80 వేల మంది డాక్టర్లు తమ సంస్థ అందించినట్లుగా శ్రీచైతన్య  ( Sri Chaitaynya ) ప్రకటించిందని అలా చేయడం అసాధ్యమని ఉపేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. లీగర్ ఓపీనియన్ తీసుకుని ఈ ఫిర్యాదుపై ముందుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 


అల్లు అర్జున్ నటించిన అనేక ప్రకటనలపై దుమారం 


ఈ గతంలో అల్లు అర్జున్ నటించిన ర్యాపిడో (Rapido) యాడ్‌పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. టీఎస్ఆర్టీసీ (TSRTC) బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ (Sajjanar) ఫైర్ అయ్యారు. యాడ్‌లో కించపరిచే విధంగా ఉన్న అంశాలను తొలగించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతో ర్యాపిడో సంస్థ దిగివచ్చింది. అల్లు అర్జున్ కూడా దానిపై వివరణ ఇచ్చారు. ఆ యాడ్ తర్వాత బన్ని నటించిన జొమాటో (zomato) యాడ్‌ కూడా వివాదాస్పదమైంది. అందులో నటుడు సుబ్బరాజు (Subbaraju)ను కొట్టిన యాక్షన్ సీక్వెన్స్ సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందంటూ వివాదం నెలకొంది. ఇప్పుడు  శ్రీచైతన్య సంస్థ యాడ్ కూడా వివాదాస్పదమవుతోంది.


ప్రైవేటు కాలేజీలు... సినీ హీరోలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకోవడం అరుదు. అయితే శ్రీచైతన్య మాత్రం అల్లు అర్జున్‌ను ( Allu Arjun ) తమ ఐకాన్‌గా పెట్టుకుని ప్రచారం చేసుకుంటోంది. ఆ ప్రచారం వికటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.