YouTube AI Feature: వీడియో ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ ఒక కీలక మార్పులు చేర్పులు చేసింది. ఒక పెద్ద అడుగు వేస్తూ తన లైక్‌నెస్ డిటెక్షన్ (Likeness Detection) టెక్నాలజీని ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి కూడా అందుబాటులోకి తెచ్చింది. AI ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలను, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తించడంతో పాటు సెలబ్రిటీల గుర్తింపును రక్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం అని సంస్థ తెలిపింది.

Continues below advertisement

Likeness Detection టెక్నాలజీ అంటే ఏమిటి?ఈ టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వీడియోలను స్కాన్ చేస్తుంది. ఎవరైనా వ్యక్తి ముఖాన్ని ఏదైనా పద్ధతిలో క్రియేట్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలను ఇది గుర్తిస్తుంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ ముఖం, రూపాన్ని ఎవరైనా తప్పుగా ఉపయోగిస్తే, ఈ సిస్టమ్ దానిని గుర్తించి పట్టుకుంటుంది. ఇది యూట్యూబ్‌లో కాపీరైట్ కంటెంట్‌ను గుర్తించే పాత కంటెంట్ ఐడీ (Content ID) సిస్టమ్ లాంటిదని సంస్థ పేర్కొంది. వీటిలో వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు ఇది ముఖాలను, సెలబ్రిటీల గుర్తింపును పర్యవేక్షిస్తుంది.

ఈ ఫీచర్ ఎందుకంత అవసరంటెక్నాలజీ దుర్వినియోగం అవుతున్న ఈ రోజుల్లో పలు ఫేక్ ప్రకటనలు, ఫేక్ స్కామ్‌లలో ప్రముఖుల ముఖాలను వాడుతున్నారు. వారి అనుమతి లేకుండా ఒకరి గుర్తింపును ఉపయోగించడం నేడు అతి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి కేసులకు అడ్డుకట్ట వేయడం, తద్వారా ఏ సెలబ్రిటీ ఫొటో, వీడియో తప్పుగా వాడకుండా చూడటమే ఈ కొత్త టెక్నాలజీ లక్ష్యమని తెలుస్తోంది.

Continues below advertisement

దీని ద్వారా ఎవరికి ప్రయోజనం మొదట్లో ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో క్రియేటర్లతో టెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు దీనిని భారీ స్థాయిలో పలు విభాగాలకు యూట్యూబ్ విస్తరిస్తోంది. ఇప్పుడు ఇందులో టాలెంట్ ఏజెన్సీలు, మేనేజ్‌మెంట్ కంపెనీలు, వారితో అనుబంధం ఉన్న సినీ ఆర్టిస్టులను చేర్చింది. ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి సెలబ్రిటీకి సొంత యూట్యూబ్ ఛానెల్ ఉండాల్సిన అవసరం లేదు.

యూజర్లకు ఉండే ఆప్షన్లు ఏమిటి?ఏదైనా వీడియోలో ఒకరి నకిలీ గుర్తింపు కనుగొంటే, సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి. వాటి ప్రకారం నడుచుకుంటూ చర్యలు తీసుకుంటారు.

మొదటగా ఆ వీడియోను తొలగించాలని కోరడం.

ఈ తరువాత కాపీరైట్ క్లెయిమ్ చేయడం.

లేదా దానిపై చర్యలు తీసుకోవాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. 

అయితే, యూట్యూబ్ ఒక విషయాన్ని యూజర్లకు స్పష్టం చేసింది. ప్రతి వీడియోను డిలీట్ చేయడం మాత్రం జరగదు.  ఎందుకంటే ప్లాట్‌ఫారమ్‌లో పేరడీ (Parody), వ్యంగ్య కంటెంట్ ప్రదర్శించేందుకు అనుమతి ఉందని గుర్తుంచుకోండి.

ఇంకా ఏం మార్పులు రాబోతున్నాయి

ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కేవలం మీ విజువల్ (ముఖం)పై మాత్రమే వర్క్ చేస్తుంది. కానీ భవిష్యత్తులో ఇందులో ఆడియో సైతం ఎవరిదో గుర్తించే సామర్థ్యాన్ని కూడా యాడ్ చేయాలని భావిస్తున్నారు. యూట్యూబ్ ఇలాంటి భద్రతను చట్టంలో భాగంగా చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది. AI ద్వారా ఒకరి వాయిస్, ఫొటో, వీడియో ద్వారా వారి గుర్తింపును తప్పుగా ఉపయోగించడాన్ని నియంత్రించే లక్ష్యంతో అమెరికాలో తీసుకొస్తున్న NO FAKES Act కు కంపెనీ మద్దతు తెలుపుతోంది.