ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేవడంలో ముందుంటుంది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజ సంస్థ Xiaomi. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలతో వీటిని విడుదల చేస్తుంది. తాజాగా ఈ కంపెనీ మరో సూపర్ డూపర్ స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేబోతోంది. ఈ నెల 18న  Xiaomi 13 Ultra లాంచ్ చేయబోతోంది.


18న Xiaomi 13 Ultra టీజర్ పోస్టర్ రిలీజ్


తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి టీజర్ పోస్టర్ ను Xiaomi విడుదల చేసింది. ఈ టీజర్ పోస్టర్ Xiaomi 13 అల్ట్రా గురించి బహిరంగంగా ప్రస్తావించనప్పటికీ, ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ లోనే లాంచ్ అవుతుందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, లాంచింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లాంచింగ్ తర్వాత కొద్ది నెలల్లోనే గ్లోబల్ విడుదల ఉంటుందని కంపెనీ తెలిపింది.






అదిరిపోయే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు


తాజాగా విడుదలైన Xiaomi 13 అల్ట్రా టీజర్ డిజైన్  ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేయనప్పటికీ, Xiaomi 13 అల్ట్రా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoCని కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, 12/16 GB RAM, 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ ని కలిగి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  


ఈ లేటెస్ట్ స్మార్ట్‌ ఫోన్ 6.7-అంగుళాల అతిపెద్ద AMOLED LTPO డిస్‌ ప్లేను కలిగి ఉంటుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ కు సపోర్టు చేయనుంది. డిస్‌ప్లే ముందు కెమెరాను కప్పి ఉంచే హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో 4900mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.






ఈ స్మార్ట్‌ ఫోన్  లైకా బ్రాండెడ్ లెన్స్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం ఫోకల్ లెంగ్త్ పరిధిలో పెద్ద ఎపర్చరు, కాంపాక్ట్ సైజ్, అధిక ఇమేజింగ్ పనితీరుతో లెన్స్ సిస్టమ్‌ కలిగి ఉంటున్నట్లు తెలుస్తోంది.  13S అల్ట్రాలోని అల్ట్రా వైడ్, టెలిఫోటో కూడా  అద్భుతమైన ఆప్టిక్స్ సామర్థ్యాలతో  వస్తాయని సమాచారం.  Xiaomi 13 Ultra USB 3.x కనెక్టివిటీ పోర్ట్‌ తో రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. Xiaomi స్మార్ట్‌ ఫోన్‌ల లో సాధారణ USB 2.0 ప్రమాణాన్ని తొలగించిన తొలి Xiaomi స్మార్ట్‌ ఫోన్ ఇదే కావడం విశేషం. Xiaomi గత సంవత్సరం చైనాలో 13 సిరీస్‌ల ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో Xiaomi 13, 13 Pro ఉన్నాయి. Xiaomi అల్ట్రా మోడల్ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. దీని ధర ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.


Read Also: OnePlus Nord CE 3 Lite కొనుగోలు చేసే ముందు, రూ.20 వేలకే లభించే స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ కూడా తెలుసుకోండి