WhatsApp: ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటి వరకు అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకురానుందని తెలుస్తోంది. ఇది ప్రైవసీని కాపాడుకోవడంలో ప్రజలకు సహాయపడుతుంది. గత సంవత్సరం WhatsApp ఫోటోలు, వీడియోల కోసం ‘View Once’ ఫీచర్‌ను తీసుకువచ్చింది.


దీని కింద, మీరు పంపిన ఏదైనా ఫోటో లేదా వీడియోను ఎదురుగా ఉన్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఇప్పుడు ఆడియో విషయంలో కూడా అలాంటిదే చేయబోతుంది వాట్సాప్. Wabetainfo వెబ్ సైట్ కథనం ప్రకారం కంపెనీ ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. దీని కింద వ్యక్తులు ఆడియోను కూడా ‘View Once’గా పంపగలరు. అంటే ఇప్పటి వరకు ఒక్కసారి ఫోటో, వీడియోలకు అందుబాటులో ఉన్న ఫీచర్ ఆడియోలో కూడా రానుంది.


ఇలా చేయలేరు
ఈ ఫీచర్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఆడియో ‘View Once’ ద్వారా పంపిస్తే మీరు ఈ ఆడియోను సేవ్ చేయలేరు, ఫార్వర్డ్ చేయలేరు, ఆ ఆడియోను రికార్డ్ చేయలేరు. ఈ ఫీచర్ ప్రైవసీని కాపాడుకోవడంలో వ్యక్తులకు మరింత సహాయం చేస్తుంది.


ఈ రోజుల్లో ప్రజలు వాట్సాప్‌లో వచ్చే ఆడియోలను రికార్డ్ చేసి, వాటిని అనేక విధాలుగా మానిపులేట్ చేయడాన్ని మీరు చూస్తూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఈ ఫీచర్ సహాయంతో మీరు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. రాబోయే కాలంలో కంపెనీ దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు.


డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం కొత్త యాప్ విడుదలైంది
వాట్సాప్ డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం కొంతకాలం క్రితం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొత్త యాప్ ద్వారా గ్రూప్ ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. యూజర్లు ఎనిమిది మందికి ఆడియో కాల్స్, 32 మందికి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కొత్త యాప్ ఇంటర్‌ఫేస్‌ను కూడా కంపెనీ మార్చింది. సందేశాల లోడ్ వేగాన్ని కూడా పెంచింది. ఇది కాకుండా, వినియోగదారులు నాలుగు వేర్వేరు గాడ్జెట్‌లు, ఒక మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ ఖాతాను ఉపయోగించవచ్చు. మొబైల్ ఫోన్‌లోని బ్యాటరీ లేదా డేటా అయిపోయినప్పటికీ, మీరు ఇతర పరికరాల్లో వాట్సాప్‌ను ఉపయోగించగలరు.


ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే వాట్సాప్, తాజాగా మరో అప్ డేట్ ను పరిచయం చేసింది. మెసేజ్‌లు డిజప్పియర్‌ కాకుండా ఉండేందుకు ‘కెప్ట్ మెసేజెస్’  అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కెప్ట్ మెసేజెస్ అప్ డేట్ ద్వారా చాటింగ్ మెసేజెస్ అన్నీ ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఈ ఫీచర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కెప్ట్‌ మెసేజ్‌ అనే  ఫీచర్‌  చాట్‌ ఇన్‌ ఫో లిస్ట్‌ లో అందుబాటులో ఉంది. కెప్ట్ మెసేజులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో ఉండే మెసేజ్ లు ఎప్పటికీ డిలీట్ కావు. ఒక వేళ సదరు మెసేజ్ లను డిలీట్ చేయాలనుకుంటే ఈజీగా డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ ‘అన్ కీప్’ అంటే సరిపోతుంది. ఎప్పుడైతే అన్ కీప్ క్లిక్ చేస్తారో, అప్పుడే ఆ మెసేజ్ లు పర్మినెంట్ గా డిలీట్ అవుతాయి.