త్వరలో కొన్ని పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్‌వేర్‌లపై పనిచేయనున్న పాత ఐఫోన్లకు సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాల్సిందే అన్నమాట.
WABetaInfo కథనం ప్రకారం... రానున్న నెలల్లో ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 అప్‌డేట్లకు వాట్సాప్ సపోర్ట్ అందించడం నిలిపివేయనుంది. ఈ కథనంలో దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. 2022 అక్టోబర్ 24వ తేదీ నుంచి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు ఈ స్క్రీన్ షాట్‌లో పేర్కొన్నారు.
వినియోగదారులు తమ ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకోక తప్పదన్న మాట. అయితే ప్రస్తుతం ఐవోఎస్ 10, 11ల మీద పనిచేసే ఫోన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్నాయి. ఐవోఎస్ 12 వీటికి అందించడం లేదు. ఈ ఫోన్లు ఉపయోగించేవారు అక్టోబర్ నుంచి వాట్సాప్‌ను ఉపయోగించడం కుదరదు. ఐఫోన్ 5ఎస్, దాని పై వెర్షన్లకు మాత్రమే ఐవోఎస్ 12 సపోర్ట్ లభించనుంది.
‘ఐవోఎస్ 12 లేదా దానికంటే పైవెర్షన్లకు మాత్రమే వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోమని మేం సిఫారసు చేస్తున్నాం. నిరంతరాయంగా వాట్సాప్‌ను ఉపయోగించేందుకు ఐఫోన్‌ను లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.’ అని వాట్సాప్ హెల్ప్ సెంటర్‌లో కూడా పేర్కొన్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!