Whatsapp Meta AI: మనందరి రోజువారీ జీవితాల్లో భాగమైన వాట్సాప్ కూడా ఏఐ క్లబ్‌లో చేరిపోయింది. భారతదేశంలో ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తుందట. మెటా రూపొందించిన అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనే ఇది. ఈ మెటా ఏఐతో వాట్సాప్ యూజర్లు దేని గురించి అయినా మాట్లాడవచ్చు. అలాగే ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు, మెటా ఏఐ దగ్గర నుంచి సలహాలు కూడా తీసుకోవచ్చు. అయితే మెటా ఏఐ మనం దానితో జరిపే సంభాషణ డేటాను ఎంత వరకు స్టోర్ చేసుకుంటుంది? అన్న విషయాలు మాత్రం తెలియరాలేదు. కాబట్టి ప్రస్తుతానికి సరదాకు కూడా పర్సనల్ విషయాలను దీంతో షేర్ చేయకుండా ఉంటే బెటర్.


వాట్సాప్‌లో దీన్ని ఓపెన్ చేయగానే పైన మెటా ఏఐ అని, దాని కిందనే ‘with Llama’ అని కనిపిస్తుంది. అంటే మెటా తన ఏఐకి Llama అని పేరు పెట్టిందని అనుకోవాలి. ఓపెన్ చేయగానే ఛాట్ పాప్ అప్‌లో "Ask Meta AI anything" అని కనిపిస్తుంది. దాని కింద కొన్ని ప్రశ్నలను అదే సజెస్ట్ చేస్తుంది కూడా. మెటా ఏఐ ఐకాన్ చూడటానికి కొంచెం మైక్రోసాఫ్ట్ కొర్టానా ఐకాన్ తరహాలో ఉంది.


మెటా ఏఐ ఫీచర్ ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఇది కేవలం ఇంగ్లిష్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఏఐతో ఛాట్ చేయడానికి ముందే ‘మీరు అడిగిన ప్రశ్నలకు మెటా ఏఐ నుంచి వచ్చే మెసేజెస్, సమాధానాలను మెటా సర్వీసులను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. ’ అని నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ ఏఐ ఛాట్‌బోట్‌కు మీ ఛాట్లకు యాక్సెస్ లేదని వాట్సాప్ ముందుగానే ప్రకటించింది. ఎప్పటి లాగానే మీ పర్సనల్ మెసేజ్‌లు, కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అయి ఉంటాయని కూడా ప్రాంప్ట్‌లో వాట్సాప్ తెలిపింది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


వాట్సాప్‌లో మెటా ఏఐతో ఛాటింగ్ చేయడం ఎలా?
వాట్సాప్‌లో మెటా ఏఐతో ఛాట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి.


1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయగానే కుడివైపు పైభాగంలో కనిపించే గుండ్రటి ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
2. అక్కడ ఓపెన్ అయిన టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను పూర్తిగా చదివి యాక్సెప్ట్ చేయాలి.
3. అక్కడ స్క్రీన్ మీద కనిపించే ప్రాంప్ట్‌ను ఎంచుకోవచ్చు లేదా మీకు వచ్చిన సందేహాన్ని అక్కడ పేస్ట్ చేయవచ్చు.
4. సెండ్ బటన్ నొక్కగానే మీరు ఏఐతో సంభాషణ ప్రారంభించినట్లే.


ఈ ఏఐ ఛాట్‌బోట్‌కు సంబంధించి వాట్సాప్ వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్‌ను కూడా తీసుకుంటోంది. మెటా ఏఐ జనరేట్ చేసిన సమాధానాలను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ 'Good response' లేదా 'Bad response' అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వినియోగదారులు తమ అభిప్రాయాన్ని అక్కడ షేర్ చేయవచ్చు. ఏఐ జనరేట్ చేసే కొన్ని సమాధానాలు సరైనవి కాకపోయే అవకాశం కూడా ఉందని వాట్సాప్ ముందుగానే హెచ్చరిస్తుంది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు