వాట్సాప్‌లో ఫాదర్స్ డే మెసేజ్‌లను ఓపెన్ చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ మెసేజ్‌ల్లో ఉండే లింక్‌లను ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ మెసేజ్‌ల ద్వారా ఫిషింగ్ స్కామ్ జరుగుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో హెయినెకెన్ బీర్ ఫాదర్స్ డే కాంటెస్ట్ 2022 పేరిట ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ‘5,000 coolers full of Heineken beers’ ఉచితంగా అందుకోవచ్చని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు.


ఈ మెసేజ్‌లో హెయినెకెన్ బీర్ల కేసు ఫొటో, ఒక లింక్ ఉంటాయి. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే డేంజరస్ ఫిషింగ్ పేజీలు ఓపెన్ అవుతాయి. ఆ వెబ్ సైట్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలిస్తాయి. ఈ విషయాన్ని మొదట ఆన్‌లైన్ థ్రెట్ అలెర్ట్స్ అనే వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.


అయితే ఇది పెద్ద స్కామ్ అని కంపెనీ రిపోర్ట్ చేసింది. ఈ మేరకు హెయినెకెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఇది ఒక స్కాం. దీన్ని మా దృష్టికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఫార్వార్డ్ లింక్స్‌పై దయచేసి క్లిక్ చేయకండి. చాలా థ్యాంక్స్.’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!