ఎంతో మందికి ఉపయోగపడే కొత్త ఫీచర్‌పై వాట్సాప్ ప్రస్తుతం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ Do Not Disturb (DND) మోడ్‌లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్ వస్తే ఇకపై వినియోగదారులకు నోటిఫికేషన్ రానుంది. వాట్సాప్ ఫీచర్లకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందించే WABetaInfo దీని గురించి ప్రత్యేకంగా తెలిపింది. ఈ ఫీచర్ వాట్సాప్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ బీటా ఫర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.21.7లో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మీ సెట్టింగ్స్‌లో డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఆన్ చేసినప్పటికీ మీకు వాట్సాప్‌లో ఏదైనా మిస్డ్ కాల్ వస్తే మీకు తెలుస్తుంది. ఈ వాట్సాప్ బీటా ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. స్టేబుల్ అప్‌డేట్ ద్వారా మిగతా యూజర్లకు ఈ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో తెలియరాలేదు.
వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. దీంతో గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్న సభ్యుల ప్రొఫైల్ ఫోటో కూడా చూడవచ్చు. ఈ ప్రొఫైల్ ఫోటో సభ్యుల పేర్లతో పాటు చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మీరు గ్రూప్ సభ్యుల ఫోటోలను చూడటానికి వారి ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్, పేరుతో పాటు, వారి ఫోటో కూడా గ్రూప్ చాట్‌లో మీకు కనిపిస్తుంది.
వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌ను మొదట WABetainfo లీక్ చేసింది. దీని కథనం ప్రకారం, WhatsApp ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి iOS కోసం WhatsApp బీటా తాజా వెర్షన్‌ను అమలు చేస్తున్న బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఐఓఎస్ 22.18.0.72 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా, వాట్సాప్ గ్రూప్‌లోనే సభ్యుని ఫోటోను చూపించడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెస్క్‌టాప్ బీటా కోసం కూడా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ ఫీచర్ మిగిలిన వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
రిపోర్ట్‌లో ఇచ్చిన స్క్రీన్‌షాట్ ప్రకారం, గ్రూప్‌లోని సభ్యుల మెసేజ్‌లో పేరు పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. దానిపై వినియోగదారు ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. మీ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంటే, గ్రూప్‌లో మెసేజ్‌కి ముందు ఫోటోను మీరు చూస్తారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కనిపిస్తే ఇది మంచి UI అడిషన్. సమూహంలోని సభ్యులు ఒకరినొకరు గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే సభ్యునికి ప్రొఫైల్ ఫోటో లేకపోయినా లేదా ప్రైవసీ సెట్టింగ్‌ల కారణంగా ప్రొఫైల్ ఫోటో కనిపించకపోతే ఫోటోకు బదులుగా మెసేజ్ కలర్ సింబల్ కనిపిస్తుంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?