Vivo Foldable Phone: వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ విషంయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే లాంచ్ అయింది. కార్బన్ ఫైబర్ హింజ్, వీ3 ఇమేజింగ్ చిప్ ఇందులో ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందించారు. ఇంటర్నల్ ఫోల్డింగ్ ప్యానెల్ సైజు 8.03 అంగుళాలుగా ఉండనుంది. వివో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లను చైనీస్ మార్కెట్లో మాత్రమే విక్రయిస్తుంది.


వివో ఎక్స్ ఫోల్డ్ 3 స్మార్ట్ ఫోన్ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి ‘ది బెస్ట్  ఫోల్డ్ ఎవర్’ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది. అయితే కచ్చితంగా ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఒకవేళ లాంచ్ అయితే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.


వినిపిస్తున్న వార్తల ప్రకారం జులై ప్రారంభంలో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో మనదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ చైనాలో ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 9,999 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1,16,000) నిర్ణయించారు. మనదేశంలో రూ.1.3 లక్షల రేంజ్‌లో దీని ధర ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ధర అంత కంటే తగ్గితే మాత్రం చైనీస్ వేరియంట్లో అందించిన ఫీచర్లను డౌన్‌గ్రేడ్ చేస్తుందని అనుకోవచ్చు.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


గత కొన్ని సంవత్సరాలుగా వివో చాలా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. కానీ అవన్నీ చైనీస్ మార్కెట్‌కే పరిమితం అయ్యాయి. వివో మొట్టమొదటి సారి తన ఫోల్డబుల్ ఫోన్‌ను బయట మార్కెట్లో లాంచ్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, వన్‌ప్లస్ ఓపెన్, టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ లాంటి ఫోల్డబుల్ ఫోన్లతో వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పోటీ పడనుంది. 


వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్డ్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. ఇందులో 8.03 అంగుళాల 2కే రిజల్యూషన్ ప్రైమరీ డిస్2ప్లే, 6.53 అంగుళాలు అమోఎల్ఈడీ కవర్ డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. అవుటర్, ఇన్నర్ డిస్‌ప్లేలు రెండిట్లోనూ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5700 ఎంఏహెచ్ కాగా, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో సపోర్ట్ చేయనుంది. 






Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు