Play Store: ఫోన్ నిత్యవసరం అయిపోయింది. అయితే అందులో వాడే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఇప్పటి వరకు ఇప్పుడు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసినవి సురక్షితంగా అనుకునే వాళ్లు. అయితే టెక్నాలజీ అప్‌డేట్ అవుతున్న కొద్దీ యాప్ డిజైనర్స్‌ చాలా తెలివి మీరిపోయారు. అందుకే ఒకసారి మీ ఫోన్‌లోకి వీటి ఇన్‌స్టాల్ చేశారంటే మొత్తం వివరాలు వారికి అప్పగించినట్టే.  ఇవి మీ ఫోన్‌లోని మీ ఫోటోలు, వాలెట్ వివరాలు కూడా రహస్యంగా యాక్సెస్ చేస్తాయి. తాజా కేసు "SparkKitty" అనే కొత్త మాల్వేర్, ఇది సాధారణంగా కనిపించే యాప్‌ల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్నాయి.  

చూడటానికి సింపుల్, కానీ ప్రమాదకరంSparkKitty అనే ఈ వైరస్ మెసేజింగ్, ఫోటో ఎడిటింగ్ లేదా క్రిప్టోకు సంబంధించిన ఫీచర్లను అందించే కొన్ని యాప్‌లలో ఇన్ బిల్ట్‌గా ఉంటుంది. ఈ యాప్‌లు సాధారణంగా కనిపిస్తాయి. వాటి చాలా మంది డౌన్‌లోడ్ చేసినట్టు కూడా నివేదికలు చెబుతున్నాయి. మీరు వాటిని ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, అవి మీ ఫోటో గ్యాలరీని యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. ఆలోచించకుండా అన్నింటికీ ఓకే చెబితే మాత్రం ప్రమాదంలో పడ్డట్టే. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోతే కచ్చితంగా మీ ఫోన్‌లోని సమాచారం చోరీకి గురి అవుతుంది.  

ఈ మాల్వేర్ ఏమి చేస్తుంది?ఆ మాల్‌వేర్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత మీరు అన్నింటికి యాక్సిస్ ఇచ్చిన తర్వాత ఫోటో గ్యాలరీని స్కాన్ చేస్తుంది. ఇందులో దాగి ఉన్న మాల్వేర్ చిత్రాల్లో ఉన్న విషయాన్ని రీడ్ చేయడానికి OCR (ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్) సాంకేతికతను ఉపయోగిస్తుంది. తర్వాత మీరు ఎప్పుడైనా మీ క్రిప్టో వాలెట్ రిలేటెడ్‌ ఏదైనా స్క్రీన్‌షాట్‌ను తీసుకుంటే, ఈ మాల్వేర్ దానిని గుర్తించి చోరీ చేస్తుంది.  

ప్రమాదం ఎక్కడెక్కడ వ్యాపించింది?ఈ వైరస్ Android, iPhone రెండింటిలోనూ పనిచేస్తుంది. అధీకృతమైన స్టోర్‌ల్లోనే కాకుండా, థర్డ్‌ పార్టీ సైట్‌లలోని యాప్‌లలో ఈ మాల్‌వేర్ ఉన్నట్టు గుర్తించారు.  కొత్త ఫోటో ఏమైనా వచ్చిందా అని గ్యాలరీని నిరంతరం తనిఖీ చేస్తుంది యాప్‌. 

దొంగిలించినన సమాచారం నేరుగా హ్యాకర్ల సర్వర్‌కు పంపుతుంది.  

ఈ ప్రమాదం నుంచి ఎలా ఎలా బయటపడాలి?

1. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు ఆలోచించండి - డెవలపర్, రివ్యూలు నమ్మదగినవిగా ఉన్న యాప్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి

2. అనుమతులు ఇచ్చేటప్పుడు చాలా కేర్‌గా ఉండాలి. ఏదైనా యాప్ మీ ఫోటోలు, ఫైల్‌లు లేదా కెమెరాను ఎందుకు యాక్సెస్ చేయమని అడుగుతుందో తెలుసుకోవడం ముఖ్యం

3. క్రిప్టో సహా బ్యాంకు వివరాలు ఫోటోలలో ఉంచవద్దు - పాస్‌వర్డ్‌లు స్క్రీన్‌షాట్‌లను ఎప్పుడూ తీయవద్దు

4. పాస్‌వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించండి. ముఖ్యమైన సమాచారం కోసం సురక్షితమైన మెమొరి లేదా పాస్‌వర్డ్ మేనేజర్ ఉత్తమం

5. యాంటీవైరస్ యాప్‌ల సహాయం తీసుకోండి - ఇలాంటి మాల్వేర్‌ను గుర్తించగల నమ్మదగిన సెక్యూర్డ్ యాప్‌ను మీ ఫోన్‌లో ఉంచుకోండి

డబ్బు మాత్రమే కాదు, గోప్యతకు ప్రమాదంఈ రకమైన వైరస్ కేవలం క్రిప్టో వాలెట్ సమాచారాన్ని మాత్రమే కాకుండా, మీ వ్యక్తిగత ఫోటోలను కూడా లీక్ చేయవచ్చు. ఇప్పటివరకు, ఎటువంటి బ్లాక్‌మెయిల్ కేసు నమోదు కాలేదు, కానీ ప్రమాదం పొంచి ఉంది.