Upcoming Smartphones: ఏప్రిల్ మూడో వారంలో మనదేశంలో నాలుగు ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో రియల్‌మీ, మోటొరోలా, వివో వంటి బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లు ఉండనున్నాయి. ఇవన్నీ 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే బడ్జెట్ ఫోన్లు కావడం విశేషం.


రియల్‌మీ పీ1 సిరీస్ (Realme P1 Series)
లాంచ్ కానున్న ఫోన్‌ల జాబితాలో మొదటి ఫోన్ రియల్‌మీకి సంబంధించింది. రియల్‌మీ భారతదేశంలో తన కొత్త, ప్రత్యేకమైన లైనప్‌ అయిన పీ సిరీస్‌ను ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ కింద రియల్‌మీ రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఇందులో రియల్‌మీ పీ1, రియల్‌మీ పీ1 ప్రో 5జీ ఫోన్లు ఉండనున్నాయి.


రియల్‌మీ పీ1 ధర రూ. 15 వేల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నారు. ఈ ఫోన్ ఫీనిక్స్ రెడ్, పీకాక్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. రియల్‌మీ పీ1 ప్రో 5జీ ధర రూ. 20 వేల కంటే దిగువన ఉండనుంది. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌పై రన్ కానుంది. ఫీనిక్స్ రెడ్, ప్యారట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లను ఇది కలిగి ఉంటుంది.


మోటొరోలా జీ64 5జీ (Motorola G64 5G)
వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానున్న రెండో స్మార్ట్‌ఫోన్ మోటొరోలా జీ64 5జీ. ఈ ఫోన్ ఏప్రిల్ 16వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే లైవ్ అయింది. ఇది ఈ ఫోన్‌కు సంబంధిచిన అనేక ఫీచర్లను రివీల్ చేసింది. దీన్ని బట్టి ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుందని అనుకోవచ్చు.


మోటొరోలా జీ64 5జీ ప్రాసెసింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్‌సెట్‌ను కలిగి ఉండనుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్, వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఏకంగా 14 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందని, దాని రేంజ్‌లో బలమైన కనెక్టివిటీతో 5జీ ఫోన్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


వివో టీ3ఎక్స్ 5జీ  (Vivo T3x 5G)
ఏప్రిల్ మూడో వారంలో లాంచ్ కానున్న మూడో ఫోన్ పేరు వివో టీ3ఎక్స్ 5జీ. ఈ ఫోన్ ప్రారంభ ధర కూడా రూ.15 వేల లోపే ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. దీని ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక స్పెసిఫికేషన్‌లు, సేల్స్ ప్లాట్‌ఫారమ్ వెల్లడైంది.


వివో ఎంట్రీ లెవల్ మిడ్‌రేంజ్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్ ఉండనుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయిన మైక్రోసైట్ ద్వారా రివీల్ అయింది. ఈ ఫోన్ వెనకవైపు పైభాగంలో వృత్తాకార ఆకారపు కెమెరా మాడ్యూల్ అందించారు. దాని చుట్టూ రింగ్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో వినియోగదారులు సెలెస్టియల్ గ్రీన్, క్రిమ్సన్ బ్లిస్ అనే రెండు కలర్ ఆప్షన్‌లను పొందుతారు.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు