Smartphone Hacking: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయితే అందులో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ల దగ్గరకి వెళుతుంది. దీని కారణంగా మీ ఆర్థిక, వ్యక్తిగత జీవితం రెండూ కష్టంగా మారతాయి. ఇక్కడ హ్యాకర్లు మీ బ్యాంకింగ్ ఖాతాలోకి ప్రవేశించడం ద్వారా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఫోన్‌లో ఫైల్స్‌కు యాక్సెస్ పొందుతారు కాబట్టి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, ఇతర వాటిని కూడా పొందుతారు. మీరు హ్యాకర్ల బారిలో పడకూడదనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయ్యే దశలో ఉన్నప్పుడు కొన్ని సిగ్నల్స్ కచ్చితంగా కనిపిస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఫోన్ అకస్మాత్తుగా స్లో అవుతుంది
ఇది చాలా ముఖ్యమైన, గుర్తించదగిన సంకేతం. మీ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా నెమ్మదిగా పని చేస్తుంటే లేదా బాగా హ్యాంగ్ అవుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే హ్యాకింగ్ జరుగుతున్న సమయంలో అనేక ప్రోగ్రామ్స్ డివైస్ బ్యాక్‌గ్రౌండ్‌లో పని చేస్తాయి. ఇది ఫోన్ స్లో అయ్యేలా చేస్తుంది. అయితే ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా మీ ఫోన్‌లో ఇంటర్నెట్‌ని ఉపయోగించడంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు లేదా డేటా విపరీతంగా వినియోగిస్తున్నట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి.


ఒక్కసారిగా ఆఫ్ లేదా రీస్టార్ట్ అయినా...
ఇది కూడా ఫోన్ హ్యాక్ అయిందనడానికి ఒక సంకేతం. మీ స్మార్ట్‌ఫోన్ నిరంతరం షట్ డౌన్ అవుతుంటే లేదా దానంతట అదే రీస్టార్ట్ అవుతున్నా అది హ్యాకర్ ఆధీనంలో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా మీ ఫోన్ సెట్టింగ్స్, యాప్‌లు ఆటోమేటిక్‌గా ఛేంజ్ అవుతుంటే హ్యాక్ అయ్యే దశలో ఉన్నాయనుకోవాలి.


బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతున్నప్పటికీ...
మీ ఫోన్‌లోని బ్యాటరీ అకస్మాత్తుగా డ్రైన్ అయిపోతే అది కూడా ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతం కావచ్చు. వాస్తవానికి ఫోన్ హ్యాక్ అయిన తర్వాత, హ్యాకర్లు చాలా మాల్వేర్, యాప్‌లు, డేటాను ప్రాసెస్ చేస్తారు. ఇది బ్యాటరీని చాలా ఎక్కువగా వినియోగిస్తుంది.


మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి?
మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ చేయబడితే, దాన్ని వెంటనే ఫార్మాట్ చేయడం మంచిది లేదా దీన్ని ఫ్యాక్టరీ రీసెట్ కూడా చేయవచ్చు. అదే సమయంలో మీరు పొరపాటున కూడా ఫోన్ బ్యాకప్ తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాకప్‌తో పాటు మాల్వేర్ కూడా వచ్చి మీ ఫోన్‌లో మళ్లీ ఇన్‌స్టాల్ అవుతుంది.


ఒక్కసారి ఫోన్ హ్యాక్ అయితే మన డేటాకు ఏమాత్రం సెక్యూరిటీ ఉండదు. ఎవరి చేతికి వెళ్తుందో చెప్పలేం. కాబట్టి సమస్య పీకల మీదకు తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్త పడటం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!