శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ గతేడాది డిసెంబర్‌లోనే లాంచ్ అయింది. బడ్జెట్ విభాగంలో శాంసంగ్ లాంచ్ చేసిన మొదటి 5జీ ఫోన్ ఇదే. ప్రస్తుతం శాంసంగ్ ఇందులో 4జీ వేరియంట్‌ను రూపొందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ర్యామ్, స్టోరేజ్, కలర్ వేరియంట్లు, ధర (యూరోప్‌లో) లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జీ ధర (అంచనా)
ప్రముఖ టిప్‌స్టర్ సుధాంశు ఆంబ్రోర్ తెలిపిన దాని ప్రకారం... ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 180 యూరోల (సుమారు రూ.15,000) రేంజ్‌లో ఉండనుంది. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 200 యూరోల (సుమారు రూ.17,000) రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 220 యూరోల (సుమారు రూ.18,700) రేంజ్‌లో ఉండనుంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయితే దీని ధర రూ.10 వేలలోపు నుంచే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.బ్లాక్, లైట్ బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జీకి సంబంధించిన లీకులు గతంలో కూడా బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఇందులో శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ప్రకారం ఇందులో వెనకవైవు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ తెలపలేదు. అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ13 4జీ మాస్ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ13 5జీ స్మార్ట్ ఫోన్ గతేడాది డిసెంబర్‌లో లాంచ్ అయింది. దీని ధరను 249.99 డాలర్లుగా (సుమారు రూ.18,700) నిర్ణయించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండగా.. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.