మధ్య వివిధ ప్లాన్‌లతో ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా Jio కొత్త ప్లాన్స్ ప్రకటించింది. Jio మొత్తం 5 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో Netflix, Amazon Prime ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1499 విలువ చేసే ప్లాన్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రీపెయిడ్ జియో ప్లాన్‌లకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ రాదు.


రూ.399 ప్లాన్: ఈ Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 75GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి ముగిసిన తర్వాత, వినియోగదారుల నుంచి రూ.10/GB చొప్పున ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్‌తో మరికొన్ని ప్రయోజనాలు మీకు లభిస్తాయి. 200GB వరకు డేటా రోల్‌ఓవర్, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTVతో సహా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి. 


రూ. 499 ప్లాన్: ఈ Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 100GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి దాటిన తర్వాత వినియోగదారుల నుంచి రూ.10/GB చొప్పున ఛార్జ్ చేస్తారు. 200GB వరకు డేటా రోల్‌ఓవర్, 1 అదనంగా SIM కార్డ్, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS, JioTVతో సహా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి.


రూ.799 ప్లాన్: ఈ Jio పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 150GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి దాటిన తర్వాత వినియోగదారుల నుంచి రూ.10/GB చొప్పునకు ఛార్జ్  చేస్తారు. 200GB వరకు డేటా రోల్‌ఓవర్, అదనంగా 2 SIM కార్డ్‌లు, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTVతో సహా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి. 


రూ.999 ప్లాన్: ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 200GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి దాటిన తర్వాత వినియోగదారుల నుంచి రూ.10/GB చొప్పున ఛార్జీలు వసూలు చేస్తారు. 500GB వరకు డేటా రోల్‌ఓవర్, అదనంగా 3 SIM కార్డ్‌లు, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTVతో సహా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి. 


రూ.1499 ప్లాన్: పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 300GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి దాటిన తర్వాత వినియోగదారులకు రూ.10/GB ఛార్జ్ చేస్తారు. 500GB వరకు డేటా రోల్‌ఓవర్, అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTVతో సహా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా లభిస్తాయి. 


గమనిక: మాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత సంస్థను సంప్రదించగలరని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!