Paytm UPI Lite: మనదేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపు (UPI) వినియోగం నిరంతరం పెరుగుతోంది. ప్రజలు టీ, కాఫీ నుంచి లంచ్, డిన్నర్ ఇలా అన్నిటికీ Paytm, Phonepe, GPay వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వీటిలో పేటీయం ఇటీవలే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. పేటీయం యాప్‌లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. మీ పిన్‌ని ఎంటర్ చేయకుండానే చిన్న లావాదేవీలను చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.


మీరు షాప్‌లో రూ.10కి టీ తాగినా లేదా రూ.50, రూ.100తో బ్రేక్‌ఫాస్ట్ చేసినా, చెల్లింపును పేటీఎమ్‌లో చేసేటప్పుడు, ఆ సమయంలో మీ పిన్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత చిన్న చెల్లింపుల కోసం మీరు మళ్లీ మళ్లీ పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిన్‌ను ఎంటర్ చేయకుండానే చిన్న లావాదేవీలు చేయవచ్చన్న మాట.


పేటీయం యూపీఐ లైట్ ద్వారా మీరు పిన్ అవసరం లేకుండా రూ.200 వరకు మాత్రమే చెల్లింపులు చేయవచ్చు. అలాగే మీరు ఒక రోజులో పేటీయం యూపీఐ లైట్ వాలెట్‌కి కేవలం రూ. నాలుగు వేలు మాత్రమే యాడ్ చేయవచ్చు. మీరు ఈ డబ్బును యాడ్ చేయడానికి అందుబాటులో ఉన్న ఏ ఏదైనా పద్ధతిని అనుసరించవచ్చు.


ఈ యూపీఐ లైట్‌ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం ప్రారంభించింది. పేటీయం ఇప్పుడు ఈ ఫీచర్‌ని యాప్‌కి జోడించింది. ప్రజల సమయాన్ని ఆదా చేయడం, యాప్ అనుభవాన్ని మెరుగుపరచడం ముఖ్య లక్ష్యంగా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చారు.


మీరు పేటీయం యూపీఐ లైట్ ద్వారా చేసే ఏ చెల్లింపు అయినా Paytm బ్యాలెన్స్, హిస్టరీ విభాగంలో కనిపిస్తుంది. ఈ లావాదేవీలు మీ బ్యాంక్ పాస్‌బుక్‌లో రిఫ్రెష్ రేట్ అవ్వవు. చిన్న లావాదేవీల కారణంగా మీరు పాస్ బుక్ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు బ్యాంకు పాస్‌బుక్‌లో రూ. 5, రూ. 10, రూ. 100, రూ. 200 తదితర వివరాలు ఉండేవి. ఇప్పుడు అలా జరగడం లేదు. ఈ ఫీచర్ కారణంగా, మీ పాస్‌బుక్ కూడా త్వరగా ఫిల్ అవ్వదు. పెద్ద లావాదేవీలు మాత్రమే ఇక్కడ ఎంటర్ అవుతాయి.


'యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్'ను (‘RuPay credit card on లింక్‌ చేసుకునే వెసులుబాటును పేటీఎం ప్రవేశపెట్టింది. అంటే వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు జత చేసుకోవచ్చు. ఇంకా సులభంగా చెప్పాలంటే.. మీ డెబిట్‌ కార్డ్‌ లేదా బ్యాంక్ అకౌంట్లను యూపీఐతో లింక్‌ చేసుకున్నట్లే మీ దగ్గరున్న రుపే క్రెడిట్‌ కార్డ్‌లను కూడా యూపీఐకి లింక్‌ చేసుకోవచ్చు. తద్వారా, RuPay క్రెడిట్ కార్డ్ హోల్డర్లు UPI సర్వీస్‌ ద్వారా ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లోనూ వ్యాపారులకు చెల్లింపులు చేయవచ్చని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది.