OnePlus 12R Sale: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ భారతీయ మార్కెట్లో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను అమ్మకాలను మొదలు పెట్టింది. OnePlus 12R స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందిస్తోంది. OnePlus సంస్థ జనవరి 23న తన కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు OnePlus 12, OnePlus 12Rను భారత్ లో విడుదల చేసింది. OnePlus 12 అమ్మకాలు ఇప్పటికే ప్రారంభించగా, OnePlus 12R అమ్మకాలను ఇవాళ మధ్యాహ్నం నుంచి మొదలు పెట్టింది.
OnePlus 12R ధర, స్పెషల్ ఆఫర్లు
OnePlus 12R లాంఛ్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ కోసం వినియోగదారులు ప్రీ ఆర్డర్స్ చేస్తున్నారు. ముందుకు కంపెనీ ప్రీ ఆర్డర్ చేసిన హ్యాండ్ సెట్లను పంపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు అమెజాన్ లో లేదంటే OnePlus అధికారిక వెబ్ సైట్లో తీసుకునే అవకాశం ఉంది. OnePlus 12R రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి 8/128 GB కాగా, మరొకటి 16/256 GB. 8/128 GB హ్యాండ్ సెట్ ధర రూ. 39,999గా కంపెనీ నిర్ణయించింది. 16/256 GB ధరను రూ. 45,999 గా ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి కంపెనీ స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తోంది. ICICI క్రెడిట్ కార్డు లేదంటే OneCardను ఉపయోగించి కొనే వారికి రూ. 1,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. అంతేకాదు, ICICI క్రెడిట్ లేదంటే డెబిట్ కార్డు EMI, OneCard EMI ద్వారా 6 నెలల వరకు నో కాస్ట్ EMIని అందుబాటులోకి తీసుకొచ్చింది. OnePlus 12R కొనే వారికి Jio Plusలో రూ. 2,250 విలువైన ఆఫర్లను పొందే అవకాశం ఉంది.
OnePlus 12R ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే
OnePlus 12R స్మార్ట్ ఫోన్ చక్కటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 6.78 ఇంచుల 1.5k 10 bit అమోలెడ్ ProXDR డిస్ ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. HDR10+, LTPO4 మద్దతును కలిగి ఉంటుంది. అంతేకాదు LTPO ఫోర్త్ టెక్నాలజీని కలిగి ఉంది. OnePlus 12R ఆండ్రాయిడ్ 14 OxygenOS 14 మీద రన్ అవుతుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. డిస్ ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 50MP సోనీ మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Read Also: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?