New feature in X: ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో 72 శాతం మంది సోషల్ మీడియా (Social media)ను ఫాలో అవుతున్నారనేది అంతర్జాతీయ సంస్థల అంచనా. వీరిలో మాస్, క్లాస్ వర్గాలు రెండూ ఉన్నాయి. అయితే.. ప్రధాన మాధ్యమాలైన వాట్సాప్(Watsapp), ఫేస్‌బుక్ (Facebook)వంటివి మాస్‌కు చాలా చేరువయ్యా యి. వీటిలోనే ఎక్కువగా చాటింగులు, షేరింగ్‌లు జరుగుతున్నాయి. అయితే.. ఉన్నతస్థాయి వర్గాలకు చేరువైన మాధ్యమం.. ఎక్కువ మంది ఫాలో అవుతున్న మాధ్యమం `ఎక్స్`(X).. ఒకప్పటి ట్విట్టర్(Twitter). రాజకీయ నేతల నుంచి పార్టీల వరకు, పారిశ్రామిక వర్గాల నుంచి దిగ్గజాల వరకు `ఎక్స్` వేదికగా తమ అభి్ప్రాయాలను పంచుకుంటున్నారు.
విచ్చల విడి వ్యాఖ్యలు.. పోస్టులు
అయితే.. ఇటీవల కాలంలో `ఎక్స్` వేదికగా జరుగుతున్న పరిణామాలు.. వస్తున్న పోస్టులు అంతర్జాతీయ సమాజాన్ని(Internationa Society) ఇరకాటంలోకి నెడుతున్నాయి. ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) యుద్ధం సమయంలో అయినా.. ఉక్రెయిన్-రష్యా(Ukrain-Russia) యుద్ధం సమయంలో అయినా.. `ఎక్స్` వేదిక కీలకంగా మారింది. ఇక, ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎక్స్ వేదికగా క్షణాల్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇతర మాధ్యమాలకు `ఎక్స్`కు తేడా ఇదే. దీంతో ఎక్కువ మంది ఇటీవల కాలంలో ఎక్స్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే.. ఎక్స్ వేదికగా జరుగుతున్న సంభాషణలు, ప్రసంగాలు, పోస్టులు, వీడియోలు, ఆడియోలు.. ఇలా వీటిలో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. మంచి వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ, రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషపూరిత ప్రసంగాలు, చివరకు పోర్న్ వీడియోలు, దుర్భాషలు, మహిళలను లైంగికంగా వేధించడం.. వంటివి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం సమాజానికి మాత్రమే కాకుండా `ఎక్స్` ప్రతిష్ఠ కూడా దెబ్బతింటోంది.
రక్షణ, భద్రత రెండూ..
ఈ నేపథ్యంలో ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elan musk) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఓ ఫీచర్(Feature)ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎక్స్(X)కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ ఉండడంతో ఆయన ఈ సోషల్ మీడియా మాధ్యమం ప్రతిష్ఠను కాపాడుకోవడంతోపాటు.. ఖాతా దారులకు మరింత రక్షణ కల్పించాలని.. భద్రతను మరింత పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కొత్త ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ సహా.. వీడియోలు, పోర్న్ వంటివి పెరిగాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీటిని కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు.
ఖాతా బ్లాక్ చేసే ఛాన్స్!
ఈ క్రమంలో కంటెంట్, భద్రతా నియమాలను అమలు చేయడంలో భాగంగా కొత్త "ట్రస్ట్ అండ్ సేఫ్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్"ని నిర్మించనున్నారు. దీనిలో 100 మందికిపైగా కంటెంట్(Content) మోడరేటర్‌లను నియమించనున్నారు. వీరు ఎప్పటికప్పుడు కంటెంట్ భద్రతతోపాటు.. అబ్యూజివ్(Abusive) కంటెంట్‌ను తొలగిస్తారు. లేదా హెచ్చరిస్తారు. అప్పటికీ వినకపోతే.. ఖాతాను బ్లాక్ చేస్తారు. ప్రస్తుతం ఇది రూపకల్పన దశలో ఉంది.
ఇవీ.. నియమాలు..
ఈ భద్రతా నియమాలు అందుబాటులోకి వస్తే.. చిన్నారుల లైంగిక దోపిడీ(Sexual herrasment)కి సంబంధించిన వీడియోలు, చిత్రాలను నిరోధిస్తారు. దేశాల మధ జరుగుతున్న యుద్దాల్లో విధ్వంసాల పోస్టులను, వివాదాస్పద కామెంట్ల(Comments)ను నిలువరిస్తారు. మత సంబంధిత వ్యవహారాల్లో విపరీత ధోరణుల ప్రచారాలను అడ్డుకుంటున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించేలా చేస్తారు. హింసాత్మక పోస్ట్‌లపై పరిమితులు విధించనున్నారు. `ఎక్స్` ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లుగా నిర్ధారించనున్నారు. ముఖ్యంగా మహిళల(Women) విషయంలో ఎలాంటి వివాదాలకు, లైంగిక పరమైన వేధింపులకు తావివ్వకుండా ఈ కొత్త ఫీచర్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. ఇది ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందనేది మాత్రం సంస్థ వెల్లడించలేదు. బహుశ మరో రెండు మాసాల్లోనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.